'డేంజర్' సినిమాతో నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన స్వాతి ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. తెలుగులో కంటే తమిళంలో పాపులర్ నటిగా బాగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో స్వాతి కథానాయికగా నటిస్తున్న త్రిపుర చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ స్వాతితో ఇంటర్వ్యూ విశేషాలు..
సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
పల్లెటూరులో ఉండే అమాయకపు అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు వచ్చే కలలన్నీ నిజమవుతుంటాయి. అవి యాదచ్చికంగా జరుగుతున్నాయా...లేక తనకు భవిష్యత్తు తెలుస్తుందా...అనే అంశాలతో చాలా సస్పెన్స్‌తో ఎంటర్ టైనింగ్ సినిమా సాగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని భర్తతో సుఖంగా జీవిస్తున్న తనకు వచ్చిన ఒక కల ఆమె జీవితాన్ని ఏ విధంగా మార్చింద అనేది చిత్ర కథాంశం. 'త్రిపుర' దెయ్యం సినిమా కాదు. ఒక థ్రిల్లర్ మూవీ. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నేను దెయ్యంగా కనిపిస్తాననే వార్తలు నిజంకావు.

సినిమాలో లుక్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు?
'గోల్కొండ హైస్కూల్' సినిమాలో నేను చీర కడితే మరీ చిన్న పిల్లలా ఉన్నావు అంటూ చాలా మంది కామెంట్ చేసారు. అందుకే ఈ సినిమా సమయానికి కొంచెం బరువు పెరిగాను. త్రిపుర సినిమాలో దాదాపుగా చీరల్లోనే కనిపిస్తాను. ఒక సాధారణ గహిణి నిజజీవితంలో ఎలా ఉంటుందో అదే విధంగా కనిపించడానికి ప్రయత్నించాను.

నిజ జీవితంలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా?
మనిషిలోనే ఘోస్ట్ ఉంటాడు. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అసలు నమ్మను. కానీ డెస్టినీను, కర్మలను నమ్ముతాను.

సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడైనా...భయపడ్డారా?
నా కెరీర్‌లో వన్ ఆఫ్‌ది మెయిన్ స్ట్రీమ్ చిత్రమే 'త్రిపుర'. నేను మొదటిసారిగా చేసిన హర్రర్ మూవీ. సాధారణంగా నేను హర్రర్ సినిమాలను భయపడుతూ చూస్తాను. సినిమా చేసేటప్పుడు ఎక్కడా భయపడలేదు. చాలా సీరియస్‌గా చేశాను.

డైరెక్టర్ రాజకిరణ్ గురించి చెప్పండి?
రాజ్ కిరణ్‌గారు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు. అందువల్ల చిత్ర పరిశ్రమలో పలు విభిన్నమైన శాఖల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఒక్కోసారి ఆయన చెప్పే విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆయన ఒక దెయ్యంతో 3 నెలలపాటు సావాసం చేసారట. సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. త్రిపుర సినిమాని చాలా బాగా తెరకెక్కించారు.

మొదటిసారి నవీన్ చంద్రతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నవీన్‌చంద్రను ఫస్ట్ డే సెట్స్‌లో చూసినప్పుడు చాలా సైలెంట్‌గా కూర్చున్నాడు. మొదటిరోజు కదా బిల్డప్ ఇస్తున్నాడు అనుకొన్నాను. కానీ సినిమా పూర్తయ్యేంత వరకూ తన నడవడిక మారలేదు. అప్పుడు అనిపించింది ఈ అబ్బా§్‌ు నిజంగానే చాలా సైలెంట్ అండ్ డీసెంట్ అని.

సినిమాలో పెళ్లి సీన్‌లో నటించడానికి నవీన్ టెన్షన్ పడ్డారట. మీకు కూడా ఆ ఫీలింగ్ కలిగిందా?
నేను మొదటిసారి పెళ్లి అవతారంలో రెడీ అయ్యాను. షూటింగ్ మొదటిరోజు సీన్ షూట్ చేసారు. అప్పటికి నవీన్‌తో నాకు పెద్దగా పరిచయం లేదు. మండపంలో కూర్చున్న వెంటనే జూనియర్ ఆర్టిస్టులు మా పెళ్లి ఇలా అయింది...అలా అయింది అంటూ నాకు సజెషన్స్ ఇస్తున్నారు. కెమెరా చాలా దూరంగా ఉంది. మా చుట్టూ వాతావరణం చూస్తే నిజంగా పెళ్లి అవుతుందేమో అనే ఫీలింగ్ కలిగింది. నాలో సెన్సిటివిటీ ఇంకా మిగిలి ఉందని అప్పుడు అనిపించింది.

No comments:
Post a Comment