పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

ఆంధ్రా ఆక్టోపస్‌ చెప్పిందే జరిగింది

  • బిహార్‌లో నితేశే సీఎం
  • ఆర్జీ ప్లాష్‌ టీమ్‌ ద్వారా చేసిన లగడపాటి 
 ఆంధ్ర ఆక్టోఫస్‌ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ చెప్పిందే జరిగింది. బిహార్‌లో ఆర్జేడీ నేత నితీశ కుమార్‌ సారథ్యంలోని మహా కూటమియే అధికారంలోకి వచ్చింది.. ఎన్నికల ఫలితాలపై సర్వే చేసి కచ్చితమైన ఫలితాలను ఇవ్వడంలో దిట్ట అయిన లగడపాటి.. ఏలూరుకు చెందిన ఆర్జీ ప్లాష్‌ టీమ్‌ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో నిజానికి మొదట మహాకూటమికి 160 సీట్లకు పైగా వస్తాయని అంచనాకు వచ్చామనీ, అయితే మోదీకి వచ్చిన జనాన్ని చూసి కొంత సీట్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. ఏదేమైనా మహాకూటమికి విజయం తధ్యమన్న విషయం మొదటి దశ పోలింగ్‌ అనంతర ం మరింత స్పష్టమైందని అన్నారు. స్థానిక నేతలను పట్టించుకోకపోవడం, నితీశ్‌ పాజిటివ్‌ ఇమేజ్‌పైన దెబ్బ కొట్టాలని చూడటంతో పాటు రిజర్వేషన్లను పునఃసమీక్షించాలన్న ఆర్‌ఎ్‌సఎస్‌ ఛీప్‌ భగవత్‌ వ్యాఖ్యల వల్ల బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. నితీశ్‌ హయాంలో శాంతి భద్రతల సమస్యలు లేవనీ, మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించారని, స్కూల్‌ పిల్లలకు సైకిళ్ల పంపిణీ కూడా నితీశ్‌ కూటమి విజయానికి దోహదపడ్డాయని లగడపాటి ఆంధ్రజ్యోతికి తెలిపారు. గతంలో యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేశామని, బిహార్‌లో మొదటిసారి సర్వే చేయడంతో మంచి అనుభవం వచ్చిందని తెలిపారు. మోడీ సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరైనా ఓట్లు రాకపోవడానికి కారణం స్థానిక బిజెపి నేతలను పట్టించుకోకపోవడమేనని, మోడీ హవాను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో క్రిందిస్థాయి నాయకత్వం విఫలమైందని లగడపాటి తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీదే హవా అని అందరికన్నా ముందే చెప్పిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment