పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

రాజధాని యువతకు ల్యాండ్‌ సర్వేయింగ్‌లో శిక్షణ

రాజధాని ప్రాంత గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాల్లో భాగం గా ఏపీఎస్‌ఎస్‌డీసీ ల్యాండ్‌ సర్వేయింగ్‌లో శిక్షణ అంది స్తోంది. శిక్షణకు రాజధాని గ్రామాల నుంచి ప్రస్తుతం 25 నుంచి 30 వరకు అభ్యర్థులు హాజరవుతున్నారు.
శిక్షణను విజయవాడలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇస్తున్నారు. రోజు అభ్యర్థులు రాజధాని ప్రాంత గ్రామాల నుంచి మ ధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో శిక్షణకు హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ ఉంటుంది. శిక్షణ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. అభ్యర్థులకు సర్వేయింగ్‌ రంగం లో పూర్తిస్థాయి శిక్షణ అందించి ఏపీఎస్‌ఎస్‌డీసీ తరపున సర్టిఫికెట్‌ కూడా అందించనున్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్‌ సర్వేయర్ల కొరత... 
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ల్యాండ్‌ సర్వేయర్ల కొరత ఉండటంతో ఈ శిక్షణ రాజధాని ప్రాంత అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ల్యాండ్‌ సర్వేయర్ల నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో సర్వేయర్ల కొలువుకు డిమాండ్‌ పెరగనుంది. మరో మూడు నెలలల్లో రాజధాని నిర్మాణాలు ప్రారంభమయితే శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉపాధి లభిస్తుంది. 
అభ్యర్థులకు బస్‌పాస్‌ రీయింబర్స్‌మెంట్‌.. 
శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు మొదట బస్‌పాస్‌లకు చెల్లించిన నగదును ఎస్‌డీసీ అధికారులు రియింబర్స్‌ చేయనున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో శిక్షణ కేంద్రం నిర్వహించడానికి తగినంత సదుపాయాలు కలిగిన కళాశాలలు లేనందున శిక్షణ కేంద్రాన్ని విజయవాడలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉన్నందున అధికారులు బస్‌ పాస్‌ రియింబర్స్‌మెంట్‌ను తెరపైకి తెచ్చారు. 
తుళ్లూరు సీఆర్డీఏ ఆఫీసుల ద్వారా మొబిలైజింగ్‌.. 

ఏపీఎస్‌ఎస్‌డీసీ నిర్వహించే శిక్షణ శిబిరాలకు హాజరయ్యేందుకు ప్రభుత్వం రాజధాని గ్రామాల్లోని అభ్యర్థులను ఆయా గ్రామాల్లోని సీఆర్డీఏ ఆఫీసుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అభ్యర్థులకు అవగాహన కల్పించడం ద్వారా యువతను అధికారులు మొబలైజ్‌ చేస్తున్నారు

No comments:

Post a Comment