దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన ఏబీ డివిల్లీర్స్ టెస్ట్‌ల్లో మళ్లీ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మితను వెనక్కినెట్టి డివిల్లీర్స్ అగ్రస్థానానికి చేరాడు. టీమిండియా టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్‌కి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ దక్కింది. విజయ్ 8 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో విజయ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 75, 47 పరుగులతో రాణించాడు. భారత ఆటగాళ్లు ఎవరికీ టాప్-10లో చోటు దక్కలేదు. పుజారా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ ర్యాంక్‌కు చేరాడు. కోహ్లీ ఐదు స్థానాలు దిగజారి 16వ ర్యాంక్‌కు పడిపోయాడు. అశ్విన ఐదు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలవగా.. జడేజా ఏకంగా పది స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ర్యాంక్‌కు చేరాడు. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆరు నుంచి నాలుగో స్థానానికి చేరింది
No comments:
Post a Comment