ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాలలో అభివృద్థి మండలి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న రెండు సంవత్సరాల బీఈడీ కోర్సు సిలబ్‌సపై అవగాహన కార్యక్రమం మంగళవారం ముగిసిందని ిసీడీసీ డీన్ ఆచార్య ఎం కోటేశ్వరరావు తెలిపారు. రెండు సంవత్సరాల బీఈడీ సిలబ్‌సలోని 4 సెమిస్టర్‌ల సబ్జెక్టులను 7 గ్రూపులుగా శాఖాపరంగా విభజించి చర్చించామన్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు సంవత్సరాల బీఈడీ కోర్సు ప్రణాళికపై కమిటీ సభ్యులు ఆచార్య వెంకటరావు, ఆచార్య పద్మానాభయ్యలు పూర్తి అవగాహన కల్పించారన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 94 బీఈడీ కళాశాలల నుంచి 200 మంది అధ్యాపకులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య టి స్వరూప, బీడీఎస్ చైర్మన్ డాక్టర్ సునీల తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment