జిల్లాలో 2015-16లో ప్రత్యామ్నాయ పంటలు, రబీకి సంబంధించి వివిధ రకాలకు చెందిన 67,240 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు 33 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ జేడీ కృపాదాసు తెలిపారు. రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసే విత్తనాల వివరాలను ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
- ఈ సీజనలో ఎల్‌బిజి-752, పియు-31 అనే రకం మినుము విత్తనాలు 24వేల క్వింటాళ్లు.
- పెసర ఎల్‌జిజి-460 అనే రకం విత ్తనాలు 8వేల క్వింటాళ్లు,
- కందులు ఎల్‌ఆర్‌జి-41 అనే రకం విత్తనాలు 500 క్వింటాళ్లు
- శనగలు (బెంగాల్ గ్రామ్) జెజి-11, కెఎకె-2, జెఎకెఐ-9218 అనే రకాలు 17,300 క్వింటాళ్లు..
- మొక్కజొన్న ప్రైవేటు కంపెనీలకు చెందిన హైబ్రీడ్ విత్తనాలు 16 వేల క్వింటాళ్లు,
- జొన్నలు 1,440క్వింటాళ్లు స బ్సిడీపై పంపిణీ చేస్తున్నారు.
- వివిధ రకాల విత్తనాల సబ్సిడీ వివరాలు
- కిలో మినుములు రూ.153 కాగా ప్రభుత్వం రూ.51 సబ్సిడీ గా ఇస్తుంది. రైతులు రూ.102 చెల్లించాలి.
- ఫ కిలో పెసలు రూ.109 కాగా ప్రభుత్వం రూ.36.33 పైసలు సబ్సిడీ గా ఇస్తుంది. రైతులు రూ.72.67 పైసలు చెల్లించాలి.
- కిలో కందులు రూ. 93.50 పైసలు కాగా ప్రభుత్వం రూ.31.20 పైసలు సబ్సిడీ గా ఇస్తుంది. రైతులు రూ.62.30 పైసలు చెల్లించాలి.
- కిలో శెనగలు (బెంగాల్ గ్రామ్) రూ. 64.50 పైసలు కాగా ప్రభుత్వం రూ.21.50 పైసలు సబ్సిడీ గా ఇస్తుంది. రైతులు రూ.43 చెల్లించాలి.
- ప్రైవేటు కంపెనీలకు చెందిన హైబ్రిడ్ మొక్కజొన్న, జొన్న విత్తనాలకు కిలోకు రూ.25 సబ్సిడీగా ఇస్తున్నట్లు జెడి కృపాదాసు తెలిపారు.
- పంపిణీ చేసిన విత్తనాల వివరాలు
- జిల్లాలో మినుములు 2,142 క్వింటాళ్లు, పెసలు 38 క్వింటాళ్లు, కందులు 108 క్వింటాళ్లు, సెనగలు 5,240 క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు మినుములు 2,142 క్వింటాళ్లు, పెసలు 30 క్వింటాళ్లు, కందులు 180 క్వింటాళ్లు, సెనగలు 6,240 క్వింటాళ్లు పంపిణీ చేశారు.
- ఆయా మండలాల్లో సాగు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు విత్తనాలను ముందుగానే రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు జెడి కృపాదాస్ తెలిపారు. మండలాల, పంటల వారీగా విత్తనాల అవసరం, అందుబాటులో ఉండే విధంగా ప్రతి రోజు జెడి కార్యాలయంలో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సబ్సిడీ విత్తనాలు కావల్సిన రైతులు 8886614109 ఫోన చేయాలని జెడి కృపాదాసు కోరారు
No comments:
Post a Comment