పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

కృష్ణా జైలు మంగళగిరిలో.

జిల్లా జైలు కోసం గుంటూరు జిల్లా మం గళగిరిలో 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
విజయవాడలో ఉన్న సబ్‌ జైల్‌లో పరిమితికి మించి ఖైదీలను ఉంచుతుండడం, ఇతర జిల్లాల జైళ్లకు పంపేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాజధాని ప్రాంతంలో సెంట్రల్‌ జైలును నిర్మించాలన్న ప్రతిపాదనలను సీఆర్‌డీఏ అధికారుల ముందు ఉంచారు. సెంట్రల్‌ జైలు నిర్మించాలంటే కనీసం 150 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కేవలం జైలు మాత్రమే కాకుండా అడ్మినిసే్ట్రటివ్‌ భవనాలు, సిబ్బంది క్వార్టర్స్‌, ఖైదీలతో వివిధ రకాల పనులు చేయించేందుకు పలు రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయడం వంటివన్నీ చేసేందుకు ఇంత మొత్తంలో స్థలాన్ని జైళ్ల శాఖ అధికారులు కోరారు. సీఆర్‌డీఏ పరిధిలో ఇంత స్థలం కేటాయించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా మంగళగిరిలో 25 ఎకరాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖర్‌ కూడా వచ్చి స్థలాలను పరిశీలించారు. అయితే 25 ఎకరాలే ఇచ్చే పక్షంలో జిల్లా జైలును నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇది కార్యాచరణలోకి వస్తే విజయవాడ సబ్‌ జైల్లో ఉన్న భవనాలను తొలగించి పరిపాలనా భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు.

No comments:

Post a Comment