పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

ఆకట్టుకున్న ఫామ్స్‌ మార్కెట్‌

లక్షల రూపాయల జీతాలు వదులుకుని సేంద్రీయ ఉత్పత్తుల తయారీ, వాటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ కొందరు యువతీ యువకులు ఏర్పాటుచేసిన ఫామ్స్‌ మార్కెట్‌ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫైలాన్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ స్టాళ్లలో సేంద్రీయ విధానంలో పండించిన ఉత్పత్తులను ప్రదర్శనగా పెట్టారు. పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గోవు ద్వారా లభించే అనేక పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నగరవాసుల అభిరుచిని కనుగొన్న ఈ యువతీ యువకులు ప్రతి ఆదివారం ఈ ఫామ్స్‌ మార్కెట్‌ ఏర్పాటుచేస్తున్నారు.

No comments:

Post a Comment