పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉంటారు, కానీ ఔషదాల కన్నా శక్తివంతంగా ఇవి పని చేయవు మరియు ఔషదాలు ఎలాంటి దుష్ప్రభావాలను గురి చేయవు.
  • 1

    తేనే

    మలబద్దకాన్ని తగ్గించుటలో తేనే శక్తివంతంగా పని చేస్తుంది. తేనెని సరైన మొత్తంలో తీసుకోవటం వలన జీర్ణక్రియను సవ్యంగా జరిపి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజులో మూడు సార్లు నీటిలో తేనెని కలిపుకొని తాగటం వలన మలబద్దకం తగ్గిపోతుంది.
  • 2

    నీరు

    మలబద్దకం రాకపోవటానికి ముఖ్య కారణం శరీరంలో సరిపోయేంత నీరు లేకపోవటం. ప్రతి గంటకు మరియు భోజనం అయిన వెంటనే ఒక గ్లాసు నీటిని తాగండి. ఒకవేళ మీకు నీరు అవసరం లేదు అనిపించినా నీరు తాగటం మాత్రం తగ్గించకండి.
  • 3

    నారింజ పండు

    నారింజ పండు మలబద్దకాన్ని తగ్గించుటలో మంచి ఔషదంగా పని చేస్తుంది. నారింజ పండులో విటమిన్ 'C' మాత్రమే కాకుండా అధిక మొత్తంలో ఫైబర్'లను కలిగి ఉంటుంది. రోజు రెండు నారింజ పండ్లను ఉదయం ఒకటి మరియు సాయంత్రం  ఒక నారింజ పండు తినటం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందుతారు.
  • 4

    ఫైబర్

    ఎక్కువగా ఫైబర్స్'ని కలిగి ఉండే హోల్ గ్రైన్స్, పండ్లు, విత్తనాలు, మరియు వేజిటేబుల్స్'ని ఆహారంలో కలుపుకొండి. ఫైబర్స్'ని కలిఉగి ఉన్న ఆహరం తీసుకోవటం వలన ఇవి 'లాక్సైటీవ్స్'గా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రసాయనిక లాక్సైటీవ్స్ పైన ఆధారపడకుండా కొన్ని రకాల ఆహారపదార్థాలు జీర్ణక్రియలో చాలా ఉపయోగపడతాయి.
  • 5

    ఎండిన ద్రాక్షపండు

    ఇవి ఫైబర్స్'ని కలిగి ఉండటం వలన సహజసిద్ధమైన లాక్సైటీవ్స్'గా పనిచేసి, అద్బుతంగా మలబద్ధకం తగ్గించుటలో సహాయపడుతుంది. ఎండిన ద్రాక్షలో ఫైబర్స్ ఉండటం వలన నీటిని గ్రహిస్తాయి, ఇలా లాక్సైటీవ్స్'గా ప్రభావం చూపటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎండిన ద్రాక్ష పండ్ల వలన మలబద్ధకం నుండి త్వరగా కోలుకుంటారు. 
  • 6

    నిమ్మకాయ

    వేడిగా చుండే ఒక గ్లాస్ నీటిలో, చిటికెడు ఉప్పు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల శక్తివంతంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిమ్మపండు రసం పేగులను శుభ్రపరిచే సాధకంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల మలబద్దకము నుండి ఉపశమనం పొందుతారు.
  • 7

    ఆముదం నూనె

    ఆముదం నూనె శక్తివంతమైన వైద్య సంబంధమైన గుణాలను మరియు ఎక్కువ గాడత గల అన్-సాటురేటేడ్ ఫాటీ ఆసిడ్స్'ని కలిగి ఉంటుంది. ఆముదం నూనె అద్భుతమైన యాంటీ-ఇంఫ్లమేటరీ మరియు యాంటీ-బాక్టీరియల్ గుణాలని కలిగి ఉండటం వలన ఇది పేగులలోని పురుగులను తొలగించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.

No comments:

Post a Comment