- 1
మెదడుకు ఉపయోగం
గిలోయ్ నుండి తీసిన రసం, ఎక్సోజేనిక్, ఎండోజేనిక్ వంటి హానికరమైన కారకాలను తోలగించును. మెదడును శుభ్రపరచి, మానసికంగా ఒత్తిడిని కలుగచేసే విష పదార్థాలను తోలగించును. - 2
నెలసరికి (periods) సహాయపడును
నెలసరిలో ఎక్కువ స్రావం, డెలివరీ లేదా ఎబార్షన్ అయిన తరువాత ఎక్కువ స్రావం అయిన సమయంలో గిలోయ్ యొక్క వేరు, కాండము, ఆకులు నుండి తయారు చేసిన పదార్థాలు వాడటం వల్ల స్రావం తక్కువ అవును. మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే, డాక్టర్'ని సంప్రదించి గిలోయ్'ని వాడండి. - 3
యాంటీ-ఆక్సిడెంట్స్
గిలోయ్'లో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉండటము వలన కాన్సర్'ను నియంత్రించే, చికిత్సలో ఉపయోగిస్తారు. ఆధునిక చికిత్స పద్ధతులలో దీని ఉపయోగించే పాత్ర తక్కువగా ఉన్న, ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. - 4
రోగ నిరోధక వ్యవస్థకి బలాన్ని చేకూరుస్తుంది
గిలోయ్ రోగ నిరోధక శక్తిని పెంచటమే కాకుండా, కాలేయము ఆరోగ్యంగా ఉండుటలో కూడా సహాయపడును. శరీరంలోని హానికర కొవ్వు పదార్థాలను, షుగర్ సాంద్రతను తగ్గించటమే కాకుండా, వివిధ రకాలయిన ఆరోగ్య ఇబ్బందులను తగ్గిస్తింది. - 5
చర్మ రక్షణ
మీరు ఏదైనా చర్మ సంబంధమైన వ్యాధులతో భాధపడుతున్నారా? అయితే రోజుకి ఒక గ్లాస్ గిలోయ్ జ్యూస్'ను 15 రోజుల పాటు తాగటం వలన వ్యాధులు తగ్గును. ఇందులో ఉసిరి, తేనెని కలపటం వల్ల గిలోయ్ రసము రెట్టింపు శక్తి వంతంగా పనిచేస్తుంది. - 6
ప్రభాతవంతమైన కాడ
దీని కాడ చాలా ఉపయోగకరమైనది. బలహీనత, డిస్పియా, పైరెక్సియాస్, ఇంకా మూత్ర విసర్జనకి సంభందించిన వ్యాధులను తగ్గించటానికి ఉపయోగిస్తారు. - 7
ఒత్తిడిని తగ్గిస్తుంది
గిలోయ్ ఆయుర్వేధ మందులలోనే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగిస్తారు. శరీరము ఎక్కువగా ఒత్తిడికి గురి అయినపుడు, ఉపశమనాన్ని కలిగిస్తుంది. - 8
మూలశంక ఉపశమనం
గిలోయ్ పైల్స్ మరియు డిసేంటరిల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొంతమంది వైద్యులు పైల్స్'కి చికిత్సగా దీన్ని వాడమని సలహా ఇస్తున్నారు. దీనిని వాడేముందు వైద్యుడిని సంప్రదించటం మంచిది. - 9
శ్వాసకి సంబంధించిన వ్యాధులు
గిలోయ్ శ్వాసకి సంబంధించిన వ్యాధులను తగ్గించటానికి ఉపయోగిస్తారు. ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేద మందులను వాడటం మంచిది. వైద్యుడిని సంప్రదించిన తరువాత వాడటం మంచిది
No comments:
Post a Comment