పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

ప్రసవం తరువాత జుట్టు రాలిపోకుండా ఉండుటకు ఔషదాలు

గర్భసమయంలో ఆడవారిలో చాలా పొడవైన, ఆరోగ్యమైన జుట్టు ఉంటుంది కారణం వారి శరీరంలో 'ఈస్ట్రోజేన్ హార్మోన్' అధికంగా ఉత్పత్తి అవటం వలన అని చెపవచ్చు. ఈ దశలో ఈస్ట్రోజేన్ హార్మోన్ ఉత్పత్తి అధికంగా ఉండటం వలన మీ జట్టు వత్తుగా, పొడవుగా, బలంగా ఉంటుంది. కానీ ప్రసవం తరువాత, ఈస్ట్రోజేన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కావున ఈ సమయంలో జుట్టు బలహీన పడిపోయి, ఊడిపోవటం ప్రారంభం అవుతుంది. గర్భం తరువాత జుట్టు రాలిపోకుండా ఆపటానికి వేరే మార్గం లేదు. కానీ కొన్ని తగిన జాగ్రత్తలు, నియమాలను పాటించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు.

తీసుకోవలసిన ఆహరం

'ది అమెరికన్ ప్రేగ్నన్సి అసోసియేషన్' (APA) వారు అధికంగా పండ్లు మరియు కూరగాయలను తీసుకోమని సలహా ఇస్తున్నారు. ఇవి అధికంగా 'ఫ్లావనాయిడ్స్' మరియు 'యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉందటం వలన ఇవి జుట్టు పెరగటాన్ని ప్రోత్సహించి, జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. పండ్లు మరియు కూరగాయలు అధికంగా యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటాయి. ఇందులో బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, కివి, స్పీనాచ్, మరియు అర్టిచోకేస్ వంటి పండ్లు ఇందులో చేర్చబడ్డాయి. మంచి ఆహరం నియమాలను పాటించటం వలన ప్రసవం తరువాత జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు.

తీసుకోవలసిన విటమిన్స్

ఆడవారు, గర్భానికి ముందు మరియు గర్భం తరువాత మంచి ఆరోగ్య నియమాలని పాటించటం వలన, ఆమెకు మరియు వారికుటుంబానికి కుడా చాలా రకాలుగా ఉపయోగకరం. పోషకాలను అధికంగా అందించే ఆహారాన్ని తీసుకోవటం వలన ఇది సాధ్యమవును. APA ప్రకారం, ప్రసవం తరువాత ఆడవారి ఆహారంలో సంక్లిష్ట విటమిన్ 'B','C', మరియు 'E'లతో పాటూ జింక్, బయోటిన్'నిలు అధికంగా ఉపభాగాలను తీసుకోవాలి. ముఖ్యంగా వీటి వలన జుట్టు రాలటం తగ్గిపోతుంది. ఏది ఏమైనను, ఉపభాగాలను తీసుకోటానికి ముందుగా మీ వైద్యుడిని సంప్రదించటం చాలా మంచిది. కొన్ని సార్లు అధికంగా ఉపభాగాలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు మరియు మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
ప్రసవం తరువాత ఈస్ట్రోజేన్ స్థాయిలో మార్పులు రావటం వలన జుట్టు రాలిపోతుంది. మరియు మిస్కారిఎజ్, హార్మన్'లలో అసమల్యతుల వలన కుడా జుట్టు రాలిపోతుంది. కావున వీటిని అదుపులో ఉంచుటకు పొషకాలను అందించే ఉపభాగాలను తినటం మంచిది.

ఇంట్లో ఉండే ఔషదాలు

ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన ప్రసవం తరువాత జుట్టు రాలటాన్ని నివారించవచ్చు. ఇక్కడ కొన్ని రకాల శక్తి వంతమైనఔషదాలు ఇవ్వబడ్డాయి.
మెంతి విత్తనాలను పూర్తిగా ఒక రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయాన ఈ నానబెట్టిన రసాన్ని తలకు మసాజ్ చేయండి. ఇలా చేసిన తరువాత ఒక టవల్ లేదా తువ్వాలని తలకు చుట్టి 4 గంటల పాటు అలనే ఉండనివ్వండి. తరువాత షాంపూ మరియు కండిషనర్'లను వాడి జుట్టుని కడగండి.  

ఆలివ్ ఆయిల్, రోస్మేరీ ఆయిల్, గుడ్డు పచ్చసొన మరియు నిమ్మకాయ రసాన్ని కలిపి ఒక మిశ్రమంల తయారు చేయండి. దీనిని జుట్టుకి పూయండి ముఖ్యంగా వెంట్రుకల మొదళ్లకు అంటేలా చూసుకోండి. ఒక గంటసేపు ఉంచిన తరువాత కడిగేయండి.
రోస్మేరీ ఆకులను నీటిలో 5 నిమిషాల పాటు ఉడక పెట్టండి. చల్లబరచి, మీ జుట్టుని కడగటానికి వాడండి.
పచ్చి గుడ్డు యొక్క పచ్చ సొనని తలకి పూసి ఒక 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి. షాంపూటో కడిగి త్వరగా పెద్ద ఖాళీలు ఉన్న దువ్వెనతో దూయండి. జుట్టును మాములుగా ఆరనివ్వండి. ఇలా వారానికి ఒకసారి చేయటం వలన మీ వెంట్రుకల మూలల్లో బలంగా మారి జుట్టు రాలకుండా ఉంటుంది.
వారానికి ఒకసారి వేడిగా ఉన్న ఆమూదము నూనె మరియు బాదం నూనెలని సమాన స్థాయిలో కలిపిన మిశ్రమాన్ని తలకు పూయండి.
రోజుకి 2-3 సార్లు బాదం నూనెతో తలకి మసాజ్ చేయటం వలన జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి పాలు మరియు కలబద్ధ గుజ్జులు కుడా మీ జుట్టుని ఆరోగ్యవంతంగా ఉంచుటలో సహాయపడతాయి. ఈ మిశ్రమాన్ని తలకి మసాజ్ చేసి, 30 నిమిషాల పాటు వదిలివేసి వేడి నీటితో కడగండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి. ఇలా ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన జుట్టు రాలటాన్ని నివారిస్తాయి. మరియు

వీటిని వాడేటపుడు క్రింద తెలిపిన వాటికి దూరంగా ఉండాలి

మీ జుట్టును కడిగేటపుడు ఎక్కువ వేడి నీటిని వాడకూడదు. మంచి నాణ్యత ఉన్న బ్రెష్ మరియు దువ్వెనలను వాడండి. మీ జుట్టుని చిందరవందరగా కాకుండా ఒక క్రమ పద్దతి ప్రకారం దూయండి. ఎక్కువ గాడతలేని షాంపూని ఎంచుకొని, ప్రతి మూడవరోజు మీ జుట్టుని కడగండి. మరియు మీ జుట్టుకి సరిపోయే మంచి కండిషనర్'లను కుడా వాడండి.

No comments:

Post a Comment