పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

కుంకుమ పువ్వు వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

కుంకుమ పువ్వు అనగానే అందరికి గుర్తొచ్చేది గర్భంతో ఉన్న ఆడవారు దీనికి కారణం కుంకుమ పువ్వు వీరికి ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది అందరికి చాలా రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. రుజువు కోసం ఇది చదవండి.
  • 1

    డిప్రెషన్ (Depression)

    ఎవరైతే డిప్రెషన్'తో బాధపడుతున్నారో, వాళ్ళు కుంకుమ పువ్వు వాడటం వల్ల డిప్రెషన్ తొలగిపోతుంది. కుంకుమ పువ్వు శక్తి వంతమైన మరియు సురక్షితమైన యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుందని, 'టెహ్రాణ్ యూనివర్సిటీ అఫ్ మెడికల్ సైన్స్' వాళ్ళు జరిపిన పరిశోధనలో వెల్లడించారు. 6 వారాలకి ఒకసారైన 30 గ్రాముల కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల డిప్రెషన్ నుండి దూరంగా ఉంటారు.
  • 2

    కంటి చూపు

    'ARC Centre of Excellence in Vision Science and University of L’Aquila in Italy' వాళ్ళు పరిశోధన జరిపి, వయసు మీరిన తరువాత వచ్చే కంటి చూపు సమస్యలను రాకుండా ఆపుతుంది మరియు దీన్ని 'మాక్యులర్ డిజేనరేషన్'కి చికిత్సగా వాడతారు అని తెలిపారు. ఫాటీ ఆసిడ్'కి సంబంధించిన వాటిని కంటి యొక్క కణాల కణత్వచానికి అతికించి కంటి చూపును సరిగ్గా ఉంచుతుంది.
  • 3

    జ్ఞాపక శక్తిని పెంచుతుంది

    కుంకుమ పువ్వు 'క్రోసిన్', 'క్రోసెటిన్'లను కలిగి ఉండటం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వీటిని కలిగి ఉండటం వల్ల 'ఆల్జేమేర్' (Alzheimer) వంటి మెదడుకు సంబంధించిన వ్యాధుల చికిత్సగా ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మరియు 'కాగ్నేటివ్' వ్యాధికి చికిత్సలో చాలా శక్తి వంతగా పనిచేస్తుంది.
  • 4

    క్యాన్సర్

    కుంకుమ పువ్వు క్యాన్సర్'ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉన్న కణాలకు హాని కలిగించకుండా క్యాన్సర్ పెరగటాన్ని నియంత్రిస్తుంది. దీన్ని వల్ల కుంకుమ పువ్వుని వివిధ రకాల క్యాన్సర్'కు చికిత్సగా వాడుతున్నారు. 
  • 5

    అస్తమా

    కుంకుమ పువ్వును అస్తమా చికిత్సగా, శ్వాస గొట్టాలు సన్నగా అవటం వల్ల శ్వాస తీసుకోటానికి ఇబ్బందిగా ఉన్నపుడు, శ్వాస గొట్టాలను శుభ్రపరచే మూలకంగా మరియు శ్వాస తీసుకోటాన్ని సులభపరుస్తుంది. ఉపిరితిత్తులను శుభ్రపరచి, ఇన్ఫెక్షన్'ను తగ్గిస్తుంది.
  • 6

    రుతుక్రమలో సహాయం

    కుంకుమ పువ్వు వలన స్త్రీలలో 'Premenstrual Syndrome' (PMS) లో ఉపయోగపడుతుంది. 2008 లో జరిపిన ప్రయోగంలో 76 శాతం మంది, రోజు కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల 50 శాతం మందిలో PMS సమయంలో వచ్చే స్వింగ్స్ మరియు అలసటలను తగ్గిస్తుందని వెల్లడించారు.
  • 7

    ఆరోగ్యవంతమైన హృదయం

    కుంకుమ పువ్వు 'లైకోపిన్', క్రోసెటిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉండటం వలన గుండెకి సంబంధించిన వ్యాధులను చికిత్సగా మరియు రక్త ప్రసరణను సరిగా అయ్యేలా చూస్తుంది.
  • 8

    రీహాబిలిటేషన్'లో సహాయం

    'ఓపియం' వంటి వాటికి బానిసలు అయిన తరువాత వదిలి పెట్టడం చాలా కష్టం. కుంకుమ పువ్వుని వాడటం వలన ఇలాంటి వాటిని మాన్పించోచ్చు. క్రోసిన్, సఫ్రానేలను కలిగి ఉండటం వల్ల ఓపియంతో కలిసి, దాని ప్రభావాన్ని తగ్గించి మార్ఫిన్ అలవాటును దూరం చేస్తుంది.
  • 9

    ఆకలిని పెంచుతుంది

    కుంకుమ పువ్వు వలన మీకు ఆకలి పెరుగుతుంది, దీని వల్ల ఆహరం ఎక్కువగా తీసుకొంటారు మరియు ఆరోగ్యంగా ఉంటారు

No comments:

Post a Comment