తెలుగు సినీ ప్రేమికులలో నిన్న సాయంత్రం నుండి జరుగుతున్న చర్చ ఈ విషయం పైనే. గత రెండు సినిమాల్లోనూ కాస్త పద్ధతిగా కనిపించిన వరుణ్ పూరి స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పు చూపించనున్నాడు అనేది తెలుసుకోవాలంటే రేపు ఉదయం 9:24 గంటల వరకూ ఆగాల్సిందే. దర్శకుడు పూరి జగన్నాధ్ లోఫర్ ప్రోమోని విడుదల చేయటానికి ఫిక్స్ చేసిన ముహూర్తం అదే మరి. పూరి హీరో అంటే... డైలాగ్ చెవిలో చెప్పే సీక్రెట్ చెప్పినట్టు వుండదు.. ఆవేశంలో అణకువ కంటే తెగువ కనపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పూనకమోచ్చినట్టు ఊగిపోవాల్సిందే. అందుకే పూరి సినిమా ఆడే థియేటర్లు సైతం ప్రేక్షకుల ఈలలతో.. కేకలతో థియేటర్ కూడా ఊగిపోతుంది. మరి వరుణ్ ఏ స్థాయిలో పూనకం తెప్పిస్తాడో..!?
No comments:
Post a Comment