ఇదేదో కొత్త సినిమా అనుకునేరు.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం కబాలి. కబాలీశ్వరన్ అనే పాత్ర పేరు ఆధారంగా తమిళ టైటిల్ ను కబాలిగా ఫిక్స్ చేసిన చిత్ర బృందం తెలుగు వెర్షన్ కి 'మహాదేవ' అనే టైటిల్ ని ఖరారు చేశారట. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకశాముందంటూ చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా మలేషియాలో జరుగుతోంది. రాధిక ఆప్టే, జేడీ చక్రవర్తి, కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి రెహమాన్ వద్ద శిష్యరికం చేసిన సంతోష్ నారాయణ్ సంగీతాన్నందిస్తున్నాడు. కలైపులి థాను నిర్మాత.
No comments:
Post a Comment