పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

ఆమె శరీరం కన్నీటి చుక్కనూ తట్టుకోలేదు!

ఎంత బాధ వచ్చినా అందరి లాగా ఆమెకు ఏడ్చే వీలు లేదు. ఆ కన్నీటి చుక్కలు ఆమెకు సాంత్వన చేకూర్చకపోగా.. మరింతగా ఆమె బాధను పెంచుతాయి. ఎందుకంటే ఆమె భయంకరమైన వాటర్‌ ఎలర్జీతో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 35 మంది మాత్రమే ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స లేదు. బతికినంతకాలం దానితో సహవాసం చేయడమే. ఆమె పేరు నియా సెల్వే.
 
ఇలాంటి వ్యాధిని జీవితాంతం భరించాల్సి రావడం ఎవరికైనా పీడకలే. నియాకు ఈ వ్యాధి ఐదేళ్ల వయసులో వచ్చింది. అప్పట్నుంచే ఎంతోమంది వైద్యుల వద్దకు తిరిగింది. కానీ, ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆమె కేవలం వారానికి ఒకసారి మాత్రమే అదీ కేవలం రెండు, మూడు నిమిషాలే స్నానం చేస్తుంది. ఆ మాత్రం దానికే ఆమె చర్మం ఎర్రగా మారి మంట పుడుతుంది. అంత వరకు ఎందుకు కేవలం కన్నీటి చుక్క బుగ్గ మీద పడినా.. అక్కడ మండిపోతుంది. మంచినీళ్లు తాగేటపుడు కూడా చాలా జాగ్రత్తగా తాగుతుంది. బయట శరీరం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
 
‘నేను అనుభవిస్తున్నది నరకం. కానీ, ఎవరు మాత్రం ఏం చేయగలరు. నా స్నేహితులందరూ స్విమ్మింగ్‌ చేస్తుంటే నాకూ చేయాలని ఉండేది. కానీ, నాకా అవకాశం లేదు. నేను మేకప్‌ తీయడానికి, మాయిశ్చరైజర్‌ రాసుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడతాను. నా బాధ చూడలేక నా బాయ్‌ఫ్రెండ్‌ ఆ సమయంలో బయటకు వెళ్లి పోతాడు. ఎంత బాధ పడుతున్నా ఏడవడానికి కూడా లేదు. అయినా ఇలాంటి వ్యాధి ఉన్నందుకు నేనేమీ కుంగిపోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా నాలాంటి వాళ్లు 35 మంది ఉన్నారట. ఇటీవలె అమెరికాలో ఇదే వ్యాధితో బాధపడుతున్న అమ్మాయితో మాట్లాడాను. ఆమె కూడా చాలా ధైర్యంగా ఉంది. త్వరలోనే ఆమెను కలుస్తా’నని చెప్పింది.
 ఇంతకీ ఇంత భయంకరైమన ఈ వ్యాధి పేరేంటో తెలుసా? ‘ఆక్వాజెనిక్‌ యుర్టికారియా

No comments:

Post a Comment