పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

ఎన్నారైలూ.. భారత్‌లో డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ మార్పులివే!

డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ను భారత ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ గత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు. అయితే ఇటీవల దీనిని ఇటీవలె భారత కస్టమ్స్‌ అధికారులు అమలు చేయడం మొదలుపెట్టారు.

డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌లో మారిన నిబంధనలు:
1) గతంలో రూ.35 వేలు విలువ చేసే వస్తువుల వరకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ వర్తించేది. ఇప్పుడు దానిని 45 వేల రూపాయలకు పెంచారు.
 
2) ఇంతకుముందు విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు కేవలం పదివేల రూపాయలు (భారత కరెన్సీలో) మాత్రమే తమతోపాటు తీసుకువచ్చే వీలుండేది. అయితే ప్రస్తుతం దానిని రూ.25 వేలకు పెంచారు.
 
3) పది సంవత్సరాల వయసు దాటిన పీఐవోస్‌ (భారత సంతతికి చెందిన విదేశీయులు) తమతోపాటు 45 వేల రూపాయల విలువైన సరుకుతో భారత్‌కు రావచ్చు. ఇంతకుముందు ఇది కూడా రూ.35 వేలే ఉండేది.
 
4) అలాగే టోబాకో ప్రోడక్ట్స్‌ ఇంపోర్ట్‌ విషయంలో కూడా యాభై శాతం కోత విదించారు. ఇంతకుముందు 200 సిగరెట్లను, 50 సిగార్లకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ లభించేది. ఇప్పుడు దీనిని 50 శాతానికి తగ్గించారు. అంటే 100 సిగరెట్లకు, 25 సిగార్లకు మాత్రమే డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ లభిస్తుంది.
 
5) ఇక, విదేశాల నుంచి ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ప్లాస్మా టీవీల వంటివేవైనా తెస్తున్నట్టైతై కస్టమ్స్‌ ఫామ్‌లో విధిగా నమోదు చేయాలి.
 
6) విదేశాల నుంచి తీసుకొచ్చే టీవీలపై డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఒకవేళ తీసుకొచ్చినట్టైతే దాని విలువలో 36.05 శాతం ట్యాక్స్‌ కట్టాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment