పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

హిమాలయాల వయస్సు 4.7 కోట్ల సంవత్సరాలు

హిమాల యాలు సుమారు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. భూ అంతర్భాగంలోని ఫలకల కదలికల వల్ల వాటిపై ఉన్న భూభాగాలు కదలుతూ ఉంటాయనే విషయం తెలిసిందే! ఈ కదలికలతో 4.7 కోట్ల ఏళ్ల క్రితం ఇండియా, యురేసియా భాగాలు ఢీ కొని ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోయా యని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఘటనతో హిమాలయాలు ఆవిర్భవించా యని అన్నారు. అదేసమయంలో అంటార్కిటిక్‌ ప్లేట్‌ నుంచి ఓ ముక్క విడివడి దూరంగా జరిగిందని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఆసే్ట్రలియాలోని టాస్మానియా పరిమాణంలో ఉన్న ఈ సూక్ష్మ ఫలకాన్ని వారు మామ్మెరిక్స్‌ మైక్రోప్లేట్‌గా వ్యవహ రిస్తున్నారు. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం అందించిన రాడార్‌ బీమ్‌ చిత్రాల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్న ట్లు బృంద సభ్యులు వివరించారు. కాగా, భూ గర్భంలో కలిగిన ఒత్తిడి హిమాల యాల ఏర్పాటుకు కారణమయినట్లే.. ఏటా భూకంపాలకూ దారితీస్తోందని అన్నారు. యురేసియాను ఢీ కొనడానికి ముందు ఇండియన్‌ ప్లేట్‌పై ఎంత ఒత్తిడి ఉందనే విషయం తాజా ఆవిష్కరణ ద్వారా తెలుస్తోందని వారు అభిప్రాయ పడ్డారు. ఈ ఆవిష్కరణతో ఐదు కోట్ల సం వత్సరాల క్రితం ఇండియా ఉత్తర దిశగా ఏడాదికి 15 సెంటీమీటర్ల వేగంతో ప్రయా ణిస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు

No comments:

Post a Comment