పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

సుల్తాన్ కోసం చైనా వెళ్తున్న సల్మాన్..!

మరో రెండు రోజుల్లో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సల్మాన్ ఖాన్.. మరోవైపు సుల్తాన్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. రెజ్లింగ్ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. చక్ దే ఇండియా సినిమా తర్వాత.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. సల్మాన్ కెరీర్‌లో చైనాలో చిత్రీకరణ జరుపుకోబోతున్న తొలిచిత్రం ఇదే కావడం విశేషం. 2010 ఏసియన్ గేమ్స్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాల కోసం చైనాలోని గాంగ్ జో (Guangzhou) ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించనున్నారట. అయితే ఈ గేమ్స్‌కు సంబంధించిన ఔట్ డోర్ విజువల్స్ మాత్రమే చైనాలో చిత్రీకరించి.. రెజ్లింగ్‌కు సంబంధించిన ఇండోర్ సీన్స్ అన్నీ ఇండియాలోనే షూట్ చేస్తారట. ఇక 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ క్రీడలకు సంబంధించిన సీన్స్ కూడా రీ-క్రియేట్ చేయనున్నారట

No comments:

Post a Comment