పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

నేనే చిరంజీవి పెద్ద కొడుకుని!!

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కొడుకుని తానే అంటూ.. కావాలంటే ఎలాంటి పరీక్షలైనా చేయించుకోండంటూ ఓ యువకుడు పెను సంచలనానికి తెర లేపాడు. రవీందర్‌ అనే ఆ యువకుడు 'పసివాడి ప్రాణం' సినిమాలో నటించిన బాల నటుడు సుజిత్‌ తానేనంటున్నాడు. మామూలుగా అయితే అతని మాటలు మెగా సెన్సేషన్‌ అయ్యేవేమో కానీ ఈ పాయింట్‌ దగ్గరే అతగాడు జస్ట్‌ బోగస్‌ అనే సంగతి స్పష్టమవుతోంది. చిరంజీవి పెద్దకొడుకుని తానే అంటూ వచ్చి.. డిఎన్‌ఏ టెస్ట్‌లు చేసుకోమంటే మీడియా కూడా వెంటనే అలర్ట్‌ అయి దీన్ని నేషనల్‌ న్యూస్‌ చేసి వుండేదేమో. కానీ తన వాదనకి బలం చేకూర్చాలనే ఆదుర్దాతో 'పసివాడి ప్రాణం' సినిమా ఊసెత్తి అందులోని బాలనటుడ్ని తానే అనేసి పప్పులో కాలేసాడీ ప్రబుద్ధుడు.

నిజానికి పసివాడి ప్రాణంలో మూగ పిల్లాడిగా నటించిన మాస్టర్‌ సుజిత్‌ బాల నటుడు కాదు, బాల నటి! బేబీ సుజిత అందులో అబ్బాయి వేషం వేసింది. ఎదిగిన తర్వాత పలు సూపర్‌హిట్‌ టీవీ సీరియల్స్‌లో నటించి, ఆజాద్‌ చిత్రంలో నాగార్జునకి చెల్లెలి పాత్ర కూడా పోషించింది. 'సత్యం' దర్శకుడు సూర్యకిరణ్‌ చెల్లెలే ఈ సుజిత. ఈ సంగతి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సినిమా న్యూస్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికీ ఇది తెలియని సంగతేం కాదు. అయితే పాపం ఈ రవీందర్‌కి ఈ విషయం తెలిసినట్టు లేదు. అందుకే వార్తల్లోకెక్కాలనే దుగ్ధ కొద్దీ చిరంజీవి కొడుకునంటూ తెర మీదకి వచ్చిన అతను అనవసరంగా ఆ 'పసివాడ్ని' నేనేనంటూ జోకర్‌ అయిపోయాడు. 

మెగాస్టార్‌ పాపులారిటీని దెబ్బ తీయాలని, ఆయన పేరు వాడుకుని పాపులర్‌ అవ్వాలని.. రవీందర్‌ ఈ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడని, అతడికి మానసిక పరమైన రుగ్మతలేమైనా వున్నాయేమో పరీక్షలకి పంపాలని మెగా అభిమానులు అతని మాటల్ని కొట్టి పారేశారు. ఒకవేళ రవీందర్‌ కనుక 'పసివాడి ప్రాణం' ఊసెత్తకపోయి వుంటే ఇది నిజంగానే పెద్ద న్యూస్‌ అయి మెగా ఫ్యామిలీకి ఒక కొత్త న్యూసెన్స్‌ అయి వుండేదేమో. మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలమంటూ ఎన్నికల ముందు ఇలా వచ్చి కొందరు రచ్చ చేస్తుంటారు. సరాసరి చిరంజీవి లాంటి మెగాస్టార్‌కే ఎసరు పెట్టి వార్తల్లో నిలిచిపోవాలనుకున్న రవీందర్‌ ఘటికుడే! కొంచెం సినీ నాలెడ్జ్‌ వుండుంటే అతని డ్రామాకి కాస్త వెయిట్‌ వచ్చి, న్యూస్‌లో నిలవాలనే తన ముచ్చట కూడా తీరిపోయేదే. పాపం పసివాడు

No comments:

Post a Comment