పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

మొహాలీ విజయంతో ముందే వచ్చిన దివాళీ

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో 108 పరుగుల ఘన విజయంతో భారత్ రెండు రోజులు ముందే దివాళి జరుపుకుంటోంది. తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుపులు మెరిపించిన భారత బౌలర్లు సఫారీల పనిపట్టారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి చెరి ఎనిమిది వికెట్లు తీసి భారత్‌కు సునాయాస విజయం అందించారు. సమష్టిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్ కోహ్లీ యువ టీంను చక్కటి ఉపయోగించుకోని నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో 1-0తో ముందంజ వేసేలా తోడ్పడ్డాడు. మొహాళీ విజయంతో దేశంలో రెండు రోజుల ముందుగానే పండగ వాతావరణం ఏర్పడింది.

No comments:

Post a Comment