పోలీస్ శాఖలో 9 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సివిల్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేహదారుఢ్య పరీక్షలను సరళతరం చేయాలని సర్కారు నిర్ణయించింది.
సివిల్ విభాగంలో 8,360 మంది, ఎస్పీఎఫ్ 186., ఫైర్ విభాగంలో 510 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే 1880 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 2800 ఆర్మ్‌డ్, 3500 స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లు, 107 సివిల్ ఎస్‌ఐలు, 91 మంది ఆర్మ్‌డ్ ఎస్ఐలు, 288 మంది స్పెషల్ పోలీస్ ఎస్‌ఐలు, 35 మంది కమ్యూనికేషన్ ఎస్‌ఐలు, 12 మంది ఎస్పీఎఫ్ ఎస్‌ఐ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
No comments:
Post a Comment