ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మూడు బంగారు పథకాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ పథ కాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్‌కు మూడు వేలకు పైగా కాల్స్ వచ్చినట్టు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఈ పథకాలను ప్రారంభించారు. వీటికి స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. అయితే వీటికి సంబంధించి ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు మాత్రం ఒక్క రోజులోనే 3,000కు పైగా కాల్స్ వచ్చాయి. దీన్ని బట్టి ప్రజలకు ఈ పథకాలపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది’’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు. ఆరో ఢిల్లీ ఎకనామిక్ కానక్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
No comments:
Post a Comment