పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

చంచల్‌గూడ జైలు, రేస్‌కోర్సులను తరలిస్తాం: కేసీఆర్

దాదాపు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నాటికి 60 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. చంచల్‌గూడ జైలు, రేస్‌ కోర్సులను తరలించి వాటి స్థానంలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో బాలికలకు 30, బాలురకు 30 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని జూన్‌లోగా నియమించుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. తెలంగాణలో తెలుగుతో పాటు ఉర్దూను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.

No comments:

Post a Comment