కేరళలో విజృంభిస్తోన్న బిజెపి... స్థానిక సంస్థల ఎన్నికల్లో వికసించిన కమలం
కేరళలో భారతీయ జనతా పార్టీ విజృంభిస్తోంది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. అధికార యూడీఎఫ్‌ను, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌లను ఆశ్చర్యంలో పడేసింది. తిరువనంతపురంలో కమల వికాసం ఎల్‌డిఎఫ్, యూడీఎఫ్‌లను కలవరపెట్టింది. తిరువనంతపురంలో బిజెపి 34 స్థానాలు సాధించి సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బిజెపి మెరుగైన ఫలితాలు సాధించి అధికార, ప్రతిపక్షాలకు సవాలు విసిరింది.
No comments:
Post a Comment