పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

చైనా కన్నా భారత్‌లోనే అవినీతి తక్కువ... 50ఏళ్లలో తొలిసారి తగ్గిన అవినీతి


చైనా కన్నా భారత్‌లోనే అవినీతి తక్కువని ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. 175 దేశాల జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. చైనా వందో స్థానంలో ఉంది, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి తగ్గిందనేది నివేదిక సారాంశం. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ర్యాలీలో వెల్లడించారు. 17 నెలల క్రితం భారత్ గురించి ఆర్ధిక వేత్తలు భిన్నంగా రాసేవారని, తాము అధికారంలోకి వచ్చాక చైనాను అధిగమిస్తున్నామని రాస్తున్నారని గుర్తు చేశారు. గడచిన 50 ఏళ్లలో తొలిసారిగా భారత్‌లో అవినీతి తగ్గిందని ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకటించిందన్నారు. ఇదో గొప్ప విషయమని మోదీ చెప్పారు. అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. అత్యంత అవినీతికర దేశాల్లో ఉత్తరకొరియా అగ్రస్ధానంలో నిలిచింది.

No comments:

Post a Comment