తెలుగునాట నందమూరి-అక్కినేని కుటుంబాల మధ్య బాక్సాఫీస్ పోటీ అన్నది రెండు తరాలుగా సాగుతూనే ఉంది. ఇప్పుడు మూడోతరంలోనూ అదే పోటీని కోరుకుంటున్నారు...
నవతరంలోనూ అదే తీరు
తెలుగునాట స్టార్ హీరోస్ మధ్య పోటీ అన్నమాటకు శ్రీకారం చుట్టిన హీరోలు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు. వారితో మొదలయిన పోటీ ఈ నాటికీ కొనసాగుతూనే ఉంది... యన్టీఆర్ నటవారసుడిగా అడుగుపెట్టిన బాలకృష్ణ, ఏయన్నార్ నటవారసుడు నాగార్జున మధ్య కూడా పోటీ కొనసాగింది. 1984 సోలో హీరోగా అడుగు పెట్టిన బాలకృష్ణ, ఆ తరువాత రెండేళ్లకు హీరోగా వచ్చిన నాగార్జున తనకు పోటీగా నిలవాలని కోరుకున్నారు. అలాగే వారిద్దరి మధ్య కొన్నిసార్లు బాక్సాఫీస్ వార్ సాగింది. అలా నందమూరి, అక్కినేని నటవంశాల మధ్య రెండు తరాల పోరాటం జనానికి కనువిందు చేసింది. ఇప్పుడు మూడోతరం కూడా అదే కోరుకోవడం విశేషం...
మోక్షజ్ఞతో పోటీ కోరుకున్న అఖిల్
యన్టీఆర్, ఏయన్నార్ మధ్య కొనసాగిన బాక్సాఫీస్ వార్, తరువాత వారి తనయులు బాలకృష్ణ, నాగార్జున మధ్య కూడా కొనసాగింది... యన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణతో కలసి నాగార్జున నటించడం కూడా సాగింది... అయితే ఇప్పుడు అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా వస్తోన్న అఖిల్ తనకు కాంపిటీటర్ గా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను ఎంచుకోవడం విశేషం... బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ రానున్నాడని కొన్నాళ్ళుగా వినిపిస్తోంది... అది ఇంకా కార్యరూపం దాల్చకముందే అక్కినేని అఖిల్ తనకు పోటీదారుగా బాలయ్య గారి అబ్బాయి మోక్షను కోరుకుంటున్నానని చెప్పడం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది... ఏది ఏమైనా టాలీవుడ్ లోని రెండు టాప్ ఫ్యామిలీస్ మధ్య మూడోతరంలోనూ పోటీ సాగితే అభిమానులకు సంబరమే... మరి ఆ సంబరం ఎప్పుడు అంబరమంటుతుందో చూడాలి...
No comments:
Post a Comment