పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

ఓటమికి భయపడే జక్కన్న..!

ఫ్యాన్స్ కు తెలియని చాలా యాంగిళ్లు దర్శకధీరుడు రాజమౌళిలో ఉన్నాయట. వాటిలో కొన్ని పర్సనల్ అయితే కొన్ని సమాజం కోసమట. కేవలం దర్శకుడిగానే ప్రేక్షకులకి పరిచయమైన రాజమౌళి ఖాళీ దొరికినప్పుడు లోక్ సత్తా కార్యకలాపాల్లో పాల్గొంటాడని తెలిసింది చాలా తక్కువమందికే. దీంతో పాటు రాజమౌళికి టెన్నిస్ అంటే ఇష్టమని..ఏ మాత్రం వీలు చిక్కినా టెన్నిస్ రాకెట్ తో ఓ పట్టు పట్టేందుకు రెడీ అవుతుడానే విషయం చాలామందికి తెలియదు. అయితే సినిమాల్లో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజమౌళి..టెన్నిస్ కోర్ట్ లో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడని టాక్.
 
బాహుబలి మొదలవడానికి ముందు రెగ్యులర్ గా టెన్నిస్ ఆడేవాడట జక్కన్న. ఐతే ఈ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని నెలలు పాటు తనకిష్టమైన ఆటకు దూరంగా ఉన్నాడు జక్కన్న. మళ్లీ ఇటీవల రెగ్యులర్ గా ఆడుతున్నాడట. నిజానికి ఓటమిని ఇష్టపడని జక్కన్న ఓడిపోయే సందర్భాలు వచ్చినప్పుడు చాలా ఫ్రస్టేట్ అవుతాడని, ఓడిపోయాక గొడవ గొడవ చేస్తాడని రాజమౌళి ఆటని చూసిన వాళ్లు చెబుతుంటారు. మరి వారి మాటల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సినిమాల్లో మాత్రం ఓటమిని గెలిచేందుకు వీపరీతంగా కష్టపడతాడు రాజమౌళి... ఇదే స్వభావాన్ని టెన్నిస్ లో కూడా చూపిస్తాడనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాహుబలి 2 పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న ఫ్యూచర్ లో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

No comments:

Post a Comment