గ్రేటర్‌లో ఓట్ల తొలగింపుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓటర్ల జాబితా నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, ఆయన సతీమణి వసుమతిదేవి పేర్లు గల్లంతయ్యాయని సీపీఐ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.జీహెచఎంసీ అధికారులు సర్వే చేయకుండానే ఓట్లు తొలగించారనడానికి హైదర్‌గూడలోని బీఎన. రెడ్డి టవర్స్ ఫ్లాట్ నెంబర్ 104లో నివసించే నారాయణ దంపతుల ఓట్ల తొలగింపు నిదర్శనమని తెలిపింది. ఓట్ల తొలగింపులో అక్రమాలు జరిగాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని నారాయణ ప్రశ్నించారు. దీనిపై జీహెచఎంసీ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం పరిశీలన జరిపి అక్రమాలు జరిగినట్టు అంచనాకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. బృందం ఇచ్చిన నివేదిక మేరకే పునఃపరిశీలన చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్టు సమాచారం.
No comments:
Post a Comment