దీపావళి పర్వదినాన నగ రంలోని పలు ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడాయి. సాధారణ స్థాయిలో కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ట్యాంకర్లు సరఫరా చేయలేక వాటర్‌బోర్డు చేతులెత్తేసింది. ఎస్‌ఆర్.నగర్, యూసుఫ్‌గూడ డివిజన్ల పరిధిలో రెండు, మూడు రోజులుగా సరఫరాలో కోత విధిస్తున్నారు. హుమాయుననగర్, కాకతీయనగర్, విజయ్‌నగర్‌కాలనీ, ప్రశాసననగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. జంట జలాశయాలు, మంజీరా నుంచి నీటి సరఫరా తగ్గిన నేపథ్యంలో... ఆయా పైపులైన నెట్‌వర్క్‌కు కృష్ణా ఫేజ్-2, 3 నీటిని మళ్లించారు. దీనికోసం షేక్‌పేట వద్ద జంక్షన పనులు చేపట్టడంతో నగర నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సరఫరా నిలిపేస్తామని ప్రకటించినప్పటికీ... పనుల్లో జాప్యం జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ట్యాంకర్లు సరఫరా చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఇళ్లు శుభ్రపర్చుకునేందుకు, స్నానాలూ చేసేందుకూ అవస్తలు పడ్డారు.
No comments:
Post a Comment