వినియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాం
‘‘25 ఏళ్లుగా మా కుటుంబం మట్టి కుండలు వంటివి చేస్తూ ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తోంది. మా తండ్రి నుంచి వారసత్వంగా నేను ఈ వృత్తి చేపట్టాను. కొద్ది సంవత్సరాలుగా మేము తయారుచేస్తున్న సాదా ప్రమిదలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన శిక్షణలో రకరకాల డిజైన్‌లలో ప్రమిదలు తయారుచేయడం నేర్చుకున్నాను. గతంలో మేము చేసే సాదా ప్రమిదల్లో రూపాయి, రెండు రూపాయలు మాత్రమే లాభం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ సాయంతో నేర్చుకున్న డిజైనర్ ప్రమిదలకు బాగా డిమాండ్ ఉంది. ఇవి రూ. 25 మొదలు వెయ్యి వరకు రకరకాల డిజైన్‌లలో ఉన్నాయి. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ సాయంతో మా జీవితాలకు భరోసా వచ్చింది.’’
No comments:
Post a Comment