పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

మోడీకి ఏపీ ప్రజల శాపం తగిలింది

మోడీకి ఏపీ ప్రజల శాపం తగిలింది
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీడీపీకి చెందిన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీకి ఏపీ ప్రజల శాపం తగిలిందని...అందుకే బీహార్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని రాయపాటి జోస్యం చెప్పారు. 
మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి శంకుస్థాపన రోజున ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఏపీ ప్రజలకు మోడీ మట్టి, నీళ్లు ఇచ్చి నిరాశ మిగిల్చారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చినట్టుగానే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాయపాటి డిమాండ్‌ చేశారు.

ఏపీ ప్రజల ఉసురు తగిలే మోడీకి బీహార్‌లో ఘోరమైన పరాజయం ఎదురైందని...మోడీ ఇప్పటికైనా కళ్లు తెరచి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే ఆయనకు బీహార్‌లో పట్టిన గతే దేశంమొత్తం పడుతుందని రాయపాటి మండిపడ్డారు. బీహార్‌కు, జమ్మూ కాశ్మీర్‌కు లక్షల కోట్ల ప్యాకేజీలు ప్రకటించిన మోడీకి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కష్టాలు కనపడలేదా ...ఏపీకి సాయం చేయాలని ఆయనకు అనిపించలేదా అని ప్రశ్నించారు. 

ఏదేమైనా బీహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు కూడా లోలోన సంతోష పడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయపాటి ఓపెన్‌గానే మోడీపై సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. రాయపాటి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

కాంగ్రెస్‌లో ఉండగా ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే రాయపాటి టీడీపీలో కూడా అదే బాణీలో మాట్లాడడంతో పాటు ఏకంగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో పాటు ప్రధానమంత్రి మోడీపై ఘాటుగా విమర్శలు చేయడం సంచలనమే 

No comments:

Post a Comment