విశ్వహిందూ పరిషత్, దుర్గావాహిని మాతృశక్తి సంస్థల ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని 15న మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి సికింద్రాబాద్‌లోని ఉజ్జ యినీ మహంకాళి ఆలయం వరకు మహిళా యువశక్తి భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దుర్గావాహిని సంస్థ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా సేవా, సురక్షా, సంస్కార్ వంటి కార్య క్రమాలు, యువతులకు శిక్షణా తరగతులు నిర్వహించి వారిలో సంస్కారాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలో తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుత సమాజంలో అశ్లీల చిత్రాలు, సాహిత్యంతో కూడిన అంశాలపై సంస్థ ఆధ్వర్యంలో వాటిని నిరసిస్తూ ధర్నాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడది ఆదిపరాశక్తి, పరాశక్తి మహిషాసురమర్దిని అని గుర్తుంచుకునేట్లుగా మహిళా యువశక్తిని పెంపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
No comments:
Post a Comment