ప్రపంచ మధుమేహ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఐడియా ఆస్పత్రి (ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ ఎండోక్రైనాలజీ అండ్ అడిపోసిటీ) వైద్యులు శ్యామ్ కలవపల్లి, కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కూకట్‌పల్లి, కేపీహెచబీకాలనీ, బంజారాహిల్స్, ఏఎ్‌సరావునగర్, మాదాపూర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు, ఐడియా ఆస్పత్రుల్లో 14వ తేదీన వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వైద్యులు చాణక్య, శ్రీనివాసరావు, అంజనా హార్‌నూర్, శ్యామ్‌సుందర్ పరీక్షలు చేస్తారని వారు తెలిపారు. మధుమేహం, అధిక బరువు, థైరారుడ్ సమస్యతో బాధపడేవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 13లోగా కూకట్‌పల్లిలోని ఐడియా ఆస్పత్రిలో పేర్లు నమోదు చేయించుకోవాలని, మరింత సమాచారం కోసం 040- 40042000/ 8008166166 నంబర్లకు ఫోన చేసి తెలుసుకోవాలని సూచించారు
No comments:
Post a Comment