పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

వానొచ్చె.. వరదొచ్చె...

  • చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు మృతి,.. ఆరుగురు గల్లంతు
  • వెంకటగిరిలో అత్యధికంగా 24.3 సెం.మీ
  • తిరుమలలో నిండిన జలాశయాలు
 ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాళంగి, స్వర్ణముఖి, కండలేరు నదులు, పాముల కాలువ, పంబలేరు, ఇందూరు, గొడ్డేరు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాపూరు నుంచి కడప, వెంకటగిరి, గూడూరు మార్గాలకు రాకపోకలు ఆగిపోయాయి. వెంకటగిరిలో అత్యధికంగా 24.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి వర్షపాతం 11.7 సెంటీమీటర్లు ఉంది. తడ మండలం ఇరకం కుప్పంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు తాటిభూలోకం (56), డీవీ సత్రం మండలం మేనలాలచూరులో వెంకటకృష్ణయ్య (45), పూలతోట దళితవాడలోని మాలేపాటి వెంకటేశ్వర్లు (50), బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో పర్వతాల లక్ష్మమ్మ (75) మృతి చెందారు. రాపూరుకు చెందిన ట్రాన్సకో ఉద్యోగి వేణు (30) పందులవారిపల్లె వాగు దాటుతుండగా నీటిలో గల్లంతయ్యాడు. కలువాయి మండలంలో చీపినాపి వద్ద కుందూవాగులో మరో ముగ్గురు గల్లంతయినట్లు సమాచారం. ఐదు చెరువులకు గండ్లు పడింది. భారీ వర్షానికి నెల్లూరు నగరం జలమయమైంది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండి పోయాయి.
 
జిల్లాలో వెయ్యి విద్యుత స్తంభాలు నేలకూలగా, విద్యుత ట్రాన్సఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు చీకట్లోనే గడుపుతున్నారు. మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించి బాధితులను పరామర్శించారు. తక్షణం విద్యుత సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం 8.30 గంటల వరకు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షంతో తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలకు నీరు చేరింది. ఆకాశగంగ జలాశయం నిండిపోయి.. నీళ్లు పాపవినాశనం డ్యామ్‌కు చేరుతున్నాయి.
 
కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు నిండడంతో రెండు గేట్లు ఎత్తేశారు. అన్నమయ్య ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల వరకు నీరు చేరుతోంది. జిల్లాలోని చక్రాలమడుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పుల్లంగేరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. కడప జిల్లాలో కోడూరు, చిట్వేలి, తిరుపతి, రాజంపేట, రాపూరు-చిట్వేలి, కోడూరు-చిట్వేలి మధ్య రాకపోకలు స్తంభించాయి. చక్రాలమడుగులో చిక్కుకున్న నలుగురిని అటవీశాఖ సిబ్బంది కాపాడారు. రాజంపేట మండలం ఊటుకూరు పొలాల్లో చిక్కుకున్న 12 మందిని తెప్పల సహాయంతో కాపాడారు. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో వెయ్యి చెరువులు నిండి మొరవలు పోతున్నాయి. జిల్లాలో 80 చెరువులకు గండ్లు పడ్డాయి. కాళంగి రిజర్వాయర్‌, కృష్ణాపురం ప్రాజెక్టు, మల్లెమడుగు, బోగంపల్లె రిజర్వాయర్లు నిండిపోయాయి. అడవిపల్లె రిజర్వాయర్‌లో 80 శాతం, బాహుదా,పెద్దేరు, కళ్యాణిడ్యాం రిజర్వాయర్లలో 30 శాతం నీళ్లు చేరాయి. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి కళకళలాడుతోంది. కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు 2వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. చిత్తూరు జిల్లా సోమల మండలం చిన్నకంపల్లెకు చెందిన తండ్రీ కూతుళ్లు వెంకటస్వామి (54), రజిత (14) గార్గేయ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఏర్పేడు మండలంలో రెండేళ్ల బాలుడు కార్తీక్‌ నీటి గుంటలో పడి మృతి చెందాడు. కలకడ ఎస్టీ కాలనీకి చెందిన జయకృష్ణ,(12), ధను్‌ష(13) ఈతకు వెళ్లి మృతి చెందారు.
 
వర్షంతోపాటు పెనుగాలుల బీభత్సంతో తిరుమల, ఘాట్‌రోడ్లలో వంద చెట్లు నేల కూలాయి. తిరుమలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల అంధకారం నెలకొంది. రెండో ఘాట్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంగళవారం కూడా ద్విచక్ర వాహనాలను ఘాట్‌రోడ్లలో అనుమతించలేదు. వర్షం, పొగమంచు, చలితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహస్రదీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు. మాడవీధుల ప్రదక్షిణ రద్దుచేసి.. ఉత్సవర్లను నేరుగా ఆలయానికి చేర్చారు. టీటీడీ ఛైర్మన చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, రెండో ఘాట్‌రోడ్డు, తిరుమల జలాశయాలను పరిశీలించారు. రెండురోజుల్లో ఘాట్‌రోడ్డు విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గుంటూరు జిల్లాలోని 52 మండలాల్లో 7.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎండిపోతున్న పంటలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నాయి

No comments:

Post a Comment