పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

ఆ నగరాలు మేలిమి ముత్యాలు


  • వియన్నా, అస్థానా, ఆష్గాబద్‌పై ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ వ్యాఖ్య 
  • పర్యటన వివరాలు వెల్లడి

ప్రపంచస్థాయి నగరీకరణకు ఆస్ట్రియా రాజధాని వియన్నా, ఉజ్బెకిస్థానలోని అస్థానా, తుర్క్‌మెనిస్థాన రాజధాని ఆష్గాబద్‌ గొప్ప ప్రతీకలని, అమరావతి రాజధాని నిర్మాణంలో గొప్ప మెళకువలను అవి అందిస్తున్నాయని ‘ఏపీసీఆర్డీఏ’ కమిషనర్‌ ఎన.శ్రీకాంత అన్నారు. మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల బృందంతో కలసి దాదాపు 10 రోజులపాటు ఆ మూడు నగరాల్లో పర్యటించి.. ఆదివారం విజయవాడకు చేరుకొన్నారు. పర్యటన వివరాలను ‘ఆంధ్రజ్యోతి’కి అందించారు. ‘‘వియన్నా, అస్థానాలను...అమరావతి మాదిరిగా నదీతీరాన నిర్మించారు. ఆష్గాబద్‌కు ఒకవైపు ఎడారులు, మరొకవైపు పర్వతాలున్నాయి. వియన్నాకు ‘లివబుల్‌ సిటీ’గా పేరుంది. అష్థానా.. రివర్‌ఫ్రంట్‌ టూరిజాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. ‘వైట్‌ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌’గా ఆష్గాబద్‌ ఖ్యాతిని గడించింది’’ అని వివరించారు.

No comments:

Post a Comment