నగరంలోని మునిసిపల్ క్రీడా మైదానాలను క్రీడాకారులు ఇతోధికంగా వినియోగించుకునే వ్యవధిని జీహెచఎంసీ పెంచింది.
ఇందుకు అనుగుణంగా ఆయా మైదానాలను తెరచి ఉంచే వేళలను జీహెచఎంసీ సవరించింది. అంతేకాకుండా.. పగటివేళ ఆయా మైదానాలను ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వాడుకునేందుకు అనుమతించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కూడా జీహెచఎంసీ యోచిస్తోంది. జీహెచఎంసీ క్రీడా విభాగం అధికారులతో నగర కమిషనర్ జనార్దన రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడా సముదాయ భవనాల్లో మౌలిక వసతులు, సదుపాయాలను ఇంకా మెరుగు పరచాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు క్రీడా మైదానాలు, సముదాయాల్లో క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడం జరుగుతోంది. కాగా, మైదానాల వినియోగ వేళలను ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3.00 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెంచుతున్నట్టు కమిషనర్ చెప్పారు. ఉదయం, సాయంత్రం మధ్య ఖాళీ సమయంలో ఆయా మైదానాలు, క్రీడా సముదాయాలను సమీపంలోని విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు తాత్కాలిక ప్రాతిపదికన అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని కమిషనర్ జనార్దన రెడ్డి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా జీహెచఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను ఇక మీదట మరింత సమర్థంగా నిర్వహించాలని ఆయన సూచించారు. కాలనీల్లోని క్రీడా మైదానాలు, పార్క్‌ల్లో బాలలు ఆడుకునే క్రీడా సామగ్రి నెలకొల్పేందుకు స్థానికులు 25శాతం వ్యయాన్ని భరిస్తే మిగిలిన 75 శాతం వ్యయాన్ని జీహెచఎంసీ భరిస్తుందన్నారు. నగరంలోని వివిధ క్రీడా భవన సముదాయాల అధికారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విజయ్‌నగర్ కాలనీకి కె.శ్రీనివాస్ (93462 91516), షేక్‌పేట్‌కు సందీప్ కుమార్ యాదవ్ (99899 99689), అమీర్‌పేట్‌కు ఫ్రాన్సిస్ రోసారియో (98497 21703), అంబర్‌పేట్‌కు డి.కుమార్ (99120 58044), చందూలాల్ బారాదరికి సయీద్ ఇక్బాల్ (98852 04787), పీజేఆర్ క్రీడా మైదానానికి ఆంటోనీ థామస్ (97014 40508), గాంధీనగర్‌కు టి.మాధవి (99081 20342).
No comments:
Post a Comment