పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

పనోరమకు 'బాహుబలి' పనికి రాలేదు

పనోరమకు 'బాహుబలి' పనికి రాలేదు
ఓ పక్క విదేశాల్లో జరిగే చిత్రోత్సవాల్లో 'బాహుబలి' హవా సాగుతోంది. ఈ మధ్యే బుసాన్‌ ఫిలిం ఫెస్టివల్లో మన సినిమాను ఒకటికి రెండుసార్లు ప్రదర్శిస్తే 5 వేల మంది పట్టే ఆడిటోరియం నిండిపోయింది. మన రాజమౌళికి అక్కడ స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. మరికొన్ని చిత్రోత్సవాల్లోనూ 'బాహుబలి' ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే మన ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మక 'పనోరమ' చిత్రోత్సవాలకు మాత్రం బాహుబలి పనికి రాకుండా పోయింది. గోవాలో ఏటా జరిగే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) చిత్రోత్సవాలకు 'బాహుబలి'ని ఎంపిక చేయలేదు.

కనీసం సెంట్రల్‌ కమిటీ పరిశీలనకు కూడా 'బాహుబలి' నోచుకోలేదు. ప్రాథమిక దశలోనే 'బాహుబలి'ని ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ సభ్యులు తిరస్కరించడం గమనారం. ఐతే దీనిపై విమర్శలూ వస్తున్నాయి. అదే సమయంలో జ్యూరీ సభ్యుల నిర్ణయం కరెక్ట్‌ అన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇలాంటి చిత్రాల్లో ఒరిజినాలిటీ అనేది ప్రధానాంశం అవుతుందని.. వేరే సినిమాల ఛాయలుంటే పరిగణించరని.. పైగా బాహుబలి లాంటి కమర్షియల్‌ హంగులున్న సినిమాను ఈ చిత్రోత్సవాలకు ఎంపిక చేస్తే వేరే ఉద్దేశాలు వెళ్తాయన్న ఉద్దేశంతోనూ తిరస్కరించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బాహుబలి టేకింగ్‌ పరంగా.. వీఎఫ్‌ఎక్స్‌, సీజీ వర్క్‌ పరంగా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ.. కంటెంట్‌ విషయంలో చాలా వీక్‌ అని.. ఇలాంటి సాదాసీదా కథాంశాలకు చిత్రోత్సవాల్లో అస్సలు చోటు దక్కదని అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ సభ్యుల్ని తిట్టిపోయాల్సిన అవసరమేమీ లేదు

No comments:

Post a Comment