పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

మెరుగైన ప్రజారవాణా, హౌసింగ్‌, భూగర్భ సొరంగం అవశ్యం

ఒక నగరమేమో అత్యున్నతస్థాయి ప్ర జా రవాణా వ్యవస్థకు, ప్రభుత్వమే ప్రజలకు కల్పించే చక్కటి గృహవసతికి దర్పణమైతే.. ఇంకొకటి అద్భుతంగా నిర్మిత మై కూడా ప్రజా రవాణా వ్యవస్థకు ప్రా దాన్యమివ్వని కారణంగా తరచుగా ట్రాఫిక్‌ జాంలను చవిచూస్తోంది కాగా.. మరొకటి అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ కౌశల్యానికి అద్దం పట్టేలా నగరం ఆసాంతం భూగర్భంలో నిర్మించిన ‘కలెక్షన టన్నెల్‌’తో పరిశుభ్రతకు ప ట్టం కట్టింది. 
వీటిలో మొట్టమొదటిది యూరోప్‌లోని ఆసి్ట్రయా దేశపు రాజధాని వియన్నా కాగా, రెండవది ఉజ్బెకిస్థానలో ని అస్థానా, ఆఖరిది తుర్క్‌మెనిస్థాన రాజధాని నగరమైన ఆష్గాబద్‌. ఈ మూడు వరల్డ్‌ క్లాస్‌ నగరాల్లో పర్యటించి ఆదివారమే నగరానికి తిరిగి వచ్చిన ఉన్నతాఽధికారుల బృందంలోని సీఆర్‌డీఏ కమిషనర్‌ నాగులపల్లి శ్రీకాంతసంస్థ ప్రధాన కార్యాలయంలో ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్యటనలో తాము గమనించిన ప్రధానాంశాలను వివరించారు. 
ప్రజారవాణాలో అగ్రగామి.. వియన్నా.
ఆసి్ట్రయా దేశపు రాజధాని వియన్నా దన్యోబ్‌ నది ఒడ్డున వెలసిన చారిత్రాత్మక నగరం. ఈ నగర నిర్మాతలు ప్రజా రవాణా, పీపుల్స్‌ హౌసింగ్‌కు పెద్దపీట వేయడంతో దశాబ్దకాలంగా ప్రపంచంలోనే మేటి ‘నివాసయోగ్య నగరం (లివబుల్‌ సిటీ)’గా గుర్తింపు పొందుతోంది. అటు సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఆఽ దునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ప్రజోపకరమైన రీతిలో విని యోగించడం ద్వారా ఈ ఘనతను సాధిస్తోంది. మూడు అంచెల (త్రీ లేయర్స్‌) ప్రజా రవాణా వ్యవస్థ - భూగర్భంలో మె ట్రో, ఉపరితలంపై ట్రామ్‌లు, బస్సు మా ర్గాల ద్వారా ఈ నగరం ప్రపంచంలో అతి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అభి వృద్ధి పరచింది. నగర వాసుల్లో అత్యధికు లు (కార్లు, ద్విచక్రవాహనాలను వినియోగించకుండా) వీటిల్లోనే ప్రయాణిస్తుంటా రు. తద్వారా ట్రాఫిక్‌ సమస్యలు, వాతావరణ కాలుష్యం, భారీ ఇంధన వ్యయాన్ని ఈ నగరం నివారించగలుగుతోంది. దీంతోపాటు ‘పబ్లిక్‌ హౌసింగ్‌ (ప్రజలకు గృహవసతి)’ కల్పనకూ వియన్నా ఎంతో ప్రాధాన్యమివ్వడంతో ఇందులో అన్ని వర్గాల ప్రజలూ హాయిగా నివసించే వీలు కలిగింది. ఈ రెండు అంశాలు అంతర్జాతీయంగా అత్యున్నత నివాసయోగ్యమైన నగరంగా నిలిపాయి. వియన్నాను ఆనుకుని ప్రవహించే దన్యోబ్‌ నదిని కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవడం ద్వారా ప్రజలకు చక్కటి ఆహ్లాదం అందేలా చూడడం మరొక విశేషం. పైగా ఒకప్పుడు పాములా మెలికలు తిరుగుతూ ప్రవహించిన నదిని తిన్నగా చేయడం ద్వారా నగరానికి వరదల నివారణతోపాటు నగరంలో కురిసిన వర్షపు నీరు అందులోకి వేగంగా చేరి, దిగువకు వెళ్లిపోయేలా చేయడం అచ్చెరువొందిస్తుంది. వియన్నాకు అనుబంధంగా 20,000 మంది ఉండేందుకు వీలుగా నిర్మిస్తున్న యాస్పర్న్‌ నగరం యూరోపియన నిర్మాణ శైలికి దర్ప ణం పట్టేలా నిర్మితమవుతోంది. 
అస్థానా విలవిల.. 
ఉజ్బెకిస్థానలో ఇషూ నదీతీరాన నిర్మిస్తున్న అస్థానా ఎంతో సుందరంగా, అత్యాధునికంగా నిర్మితమవుతోంది. ఎటు చూసినా ఎనిమిది లేన్ల విశాలమైన రహదారులు, నదికి అభిముఖంగా బ్రహ్మాండమైన అద్భుత ఉద్యానవనాలు, పర్యాట క వసతులు కలిగి ఉండడంతోపాటు ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఆర్కిటెక్ట్‌లు రూపకల్పన ద్వారా రూపుదిద్దుకుంటున్న ఈ నగరం మామూలుగానైతే వంక పెట్టలేనిదిగా ఉండాలి. మొత్తం 12 లక్షలమంది సౌకర్యవంతంగా, ఏ లోటూ లే కుండా జీవనం సాగించేందుకు వీలుగా నిర్మించదలచిన ఈ నగరం 10 ఏళ్లలో నిర్మితమైంది. ఇప్పటికి కేవలం 6 లక్షల మంది అందులో ఉం డడం ప్రారంభించేసరికే ట్రాఫిక్‌ జాంలతో ఉ క్కిరిబిక్కిరవుతోంది. నిపుణులు ఈ నగరాన్ని ‘కార్‌ బేస్డ్‌ (కార్ల ఆధారిత) సిటీ’గా నిర్మించడం. జ నాభా తక్కువగా ఉన్నా, విశాలమైన రహదారులున్నా ప్రజారవాణా వ్యవస్థ లేనందున లెక్కకు మిక్కిలిగా ఉన్న నగర వాసుల కార్లు, ఇతర స్వంత వాహనాలతో ఈ నగరంలో ట్రాఫిక్‌ స్తంభనలు నిత్యకృత్యమయ్యాయి. తమ ఈ అనుభవంతో ఈ నగర నిర్వాహకులు మన ఉన్నతాధికారుల బృందానికి ప్రజా రవాణా వ్యవస్థకు అ త్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీంతోపాటు పలు ప్రజోపయోగ వ్యవస్థల ఏర్పాటుకు, సమర్ధ నిర్వహణ కోసం ‘భూగర్భ సొరంగం (అండర్‌గ్రౌండ్‌ యుటిలిటీ టన్నెల్‌)’ నిర్మించుకోవడమూ అత్యావశ్యకమని చెప్పారు. సీఆర్‌డీఏ తరహాలోనే ‘జెన ప్లాన’ అనే సంస్థ ఈ నగరం నిర్మాణం, నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇందులో 280 మంది ప్లానర్లు ఉండడం విశేషం. 
భారీ భూగర్భ సొరంగం, శ్వేతసౌధాలు.. ఆష్గాబద్‌ ప్రత్యేకత 
తుర్క్‌మెనిస్థాన రాజధాని నగరమైన ఆష్గాబద్‌ గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే ఇది సాధించిన ఘనతలు మాత్రం తక్కువేం కావు! కొన్ని నెలల క్రితం అక్కడికి పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నగరపు సౌం దర్యం, నిర్మాణ రీతులను ప్రత్యక్షంగా తిలకించి అమరావతిని అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలపాలనుకుంటే ముందుగా ఆష్గాబద్‌ను నిపుణులతో పరిశీలింపజేయాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి సూచించారంటేనే దీని విశిష్టతలను అర్ధం చేసుకోవచ్చు. 1948లో పెనుభూకంపం ధాటికి సర్వనాశనమైన ఈ నగరం ఆ తర్వాత ప్రజలు, ప్రభుత్వా ల మొక్కవోని దీక్ష, పట్టుదలలతో అచిరకాలంలోనే అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. ఒకపక్క ఎడారులు, మరొకపక్క పర్వత సానువుల మధ్య పరమాద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రఖ్యాత ఉక్రేనియన ఇనఫ్రా ప్లానర్ల ఆధ్వర్యంలో టర్కీ దేశానికి చెందిన పేరొందిన సంస్థల ద్వారా నిర్మితమైన ఈ నగరం అత్యున్నతస్థాయి రహదారు లు, భవనాలు, అద్దంలా మెరిసే బహిరంగ ప్రదేశాలతో పాటు నగరం ఆసాంతం (30 కిలోమీటర్ల పొడవున) భూఉపరితలానికి దిగువన.. 20 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన అద్భుతమైన ‘కలెక్షన టన్నెల్‌’ (దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.6,000 కోట్లు)ను కలిగి ఉంది. ఈ టన్నెల్‌ ప్రత్యేకత ఏమిటంటే ఒ క్కొక్కటి రెండు మీటర్ల వెడల్పుతో మూడు భా గాలుగా ఉండే ఇందులో రెండు భాగాలను ఒకదానిని వర్షపు నీటి సేకరణకు, మరొక దానిని డ్రైనేజీ నీటిని సేకరించేందుకు వినియోగిస్తున్నారు. మిగిలిన దానిని స్పేర్‌గా ఉంచారు. ఈ సొరంగ భాగాలు నగరంలో ఎక్కడి వర్షపు, వ్యర్థ జలాలనైనా తమలోకి స్వీకరిస్తాయి. అనంతరం వ్యర్థ జలాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన అనంతరం వర్షఫు నీటితో కలిపి, ఈ నగరానికి ఏకైక జలవనరైన ఒక నదిలోకి కలుపుతారు. తద్వారా అటు నీటి పొదుపు, ఇటు నదీ పరిరక్షణ సాధిస్తున్నారు. ఒక విశేషమనుకుంటే మన ‘పింక్‌ సిటీ’ జైపూర్‌ తరహాలో ఇక్కడి రహదారుల పక్కన ఉండే భవనాలన్నీ తెల్లటి తెలుపు రంగు పాలరాయితో కూడిన ఎలివేషనను కలిగి ఉండి, ఆష్గాబద్‌ ‘వైట్‌ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’ అనే పేరు పొందేలా చేశాయి. 
పర్యటన ముగించుకున్న
కొద్ది గంటల్లోనే విధులకు.. 

స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది సేపటికే ఆదివారమైనప్పటికీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని సంస్థకు చెందిన డైరెక్టర్‌ వి.రాముడు (డెవలప్‌మెంట్‌ కంట్రోల్‌), ప్రణాళికా విభాగపు అధికారులతో సుదీర్ఘంగా సమావేశమై తమ పర్యటన విశేషాలను పంచుకున్నారు. అనంతరం నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. ఆయనతోపాటు విదేశీ పర్యటన నుంచి ఆదివారమే తిరిగొచ్చిన సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ రాంమనోహరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ డి.కాశీవిశ్వేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఆ వెంటనే కార్యాలయానికి వచ్చి విధుల్లో నిమగ్నులయ్యారు

No comments:

Post a Comment