పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

సుప్రీమ్ తో తలపడనున్న శివారెడ్డి

మద్దాల శివారెడ్డి.. అంటూ రేసుగుర్రంలో విలన్ గా అలరించిన రవికిషన్ ని చూసి తెలుగు చిత్ర సీమలో ఇతడు తిష్ట వేసేయడం ఖాయం అనుకున్నారంతా. అతగాడికొచ్చే అవకాశాలు చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. రేసుగుర్రం సినిమా తర్వాత అదే దర్శకుడితో కిక్ 2లో నటించిన రవికిషన్ ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో బిజీగా వున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సుప్రీమ్ సినిమాలోనూ సాయి ధరమ్ తో తలపడనున్నది ఇతడేనని తాజా సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా ఖాకీ కట్టిన పోలీస్ గా పాత్రలో నటిస్తుంటే టాక్సీ డ్రైవర్ గా సాయి ధరమ్ కనపడనున్నాడు

No comments:

Post a Comment