పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

నింగినంటేలా...

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా మొదలెట్టిన నాటినుండే సినిమాపై ప్రత్యేక చర్చ నెలకొంది. ‘మాస్ హీరోగా పేరున్న ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అన్న సాఫ్ట్ టైటిల్‌ని ఎలా ఒప్పుకున్నాడు.. అసలు సుకుమార్ స్క్రీన్‌ప్లేలో ఎలా ఒదిగిపోతాడా..?’ అని అభిమానుల్లో కూసింత టెన్షన్ కూడా వుండేది. అవన్నీ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌తోనే పటాపంచలైపోయాయి. ఇక ఈ మధ్యనే విడుదలైన టీజర్‌కి వచ్చిన స్పందనే వేరు. అదేపనిగా కళ్ళన్నీ ఆ టీజర్ పైనే పెట్టేసి లెక్కెట్టలేనన్ని లైకులుకొట్టేశారు. తాజాగా తారక్ అండ్ టీం దీపావళి ట్రీట్‌గా డాన్స్ మూమెంట్‌లో గాల్లోకెగిరినట్టున్న ఓ స్టిల్ విడుదల చేశారు. తారక్ చిందుల గురించి ప్రత్యేకించి చెప్పాలా..? ఎన్టీఆర్ ఎనర్జీ నింగినంటేలా వుంది. సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో మరి..

No comments:

Post a Comment