దేశీయ మహిళా వ్యాపారవేత్తలందరిలో ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య నెంబర్‌వన్‌గా నిలిచారు. ఫార్చున్ ఇండియా విడుదల చేసిన శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఆమె మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ ఎండి ప్రీతా రెడ్డి ఏడో స్థానా న్ని దక్కించుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి చందా కొచ్చర్ రెండోస్థానంలో, యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ మూడో స్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో హెచపిసిఎల్ చైర్‌పర్సన, ఎండి నిషి వాసుదేవ(4), ఎజడ్‌బి కోఫౌండర్ జియా మూడీ (5), కేప్ జెమిని సిఇఒ అరుణ జయంతి (5) నిలిచారు. గతేడాది ఫార్చూన జాబితాలో సైతం వీరంతా ఇదే స్థానాలను దక్కించుకోవడం విశే షం. అరుణ జయంతి మాత్రమే ఏడు నుంచి ఐ దో స్థానానికి వచ్చారు. టాప్ 50 జాబితాలో కొత్తగా పోర్టియా ఎండి మీనా గణేష్, ఈరోస్ ఎండి జ్యోతి దేశపాండే స్థానం దక్కించుకున్నారు. భట్టాచార్య పలు కొత్త పథకాలను, సంస్కరణలను చేపట్టడంలో ముందున్నారు.
No comments:
Post a Comment