ఏపీకి నిధుల కేటాయింపుపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రూ.80 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుపై కుట్ర జరుగుతోందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురావడంపై టీడీపీకి ఎంత బాధ్యత ఉందో బీజేపీకి కూడా అంతే ఉందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు చంద్రబాబు పదేపదే కేంద్రం వద్ద నిధులు అడుగుతుంటే తమకే బాధగా ఉందని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment