నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. చెన్నైయ్‌కు ఆగ్రేయంగా 320 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రికృతం అయింది. దీనిప్రభావం వల్ల తమిళనాడు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రతీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అన్ని నాకాశ్రయాలకు 1వ నెంబరు హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో దక్షిణ కోస్తా అధికారులు అప్రమత్తమయ్యారు.
No comments:
Post a Comment