పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

వారిని ముక్కలుగా నరకాలి

  • ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు
  • వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
  • శిక్షించాలని సూసైడ్‌ నోట్‌లో వేడుకోలు
 
 విద్యార్థుల వేధింపులు తాళలేక మాచర్లలో ఇంటర్‌ చదువుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని, వాళ్లను ముక్కలుగా నరకాలని సూసైడ్‌ నోట్‌లో వేడుకుంది. గుంటూరు జిల్లా మాచర్లలోని కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న వెల్దుర్తికి చెందిన విద్యార్థిని రాపో లు తిరుపతమ్మ(16) ఆత్మహత్య చేసికుంది. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్లాక నట్టింట్లో ఉరివేసుకొని అశువులు బాసింది. మాచర్లలో పలు కళాశాలల్లో చదువుకుంటున్న ఆరుగురు తన మరణానికి కారణమని రాసిన మూడు పేజీల సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. చక్రధర్‌ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రేమ్‌రాజ్‌నాయక్‌ తనను వేధించే వారిలో మొదటి నిందితుడిగా పేర్కొంది. వెల్దుర్తి మండలానికి చెందిన ప్రేమ్‌రాజ్‌నాయక్‌తోపాటు గాబ్రియేల్‌ నాయక్‌, పవన్‌, ఆదినారాయణ, వెంకటేష్‌, సురే్‌షలను కఠినంగా శిక్షించాలని తిరుపతమ్మ కోరింది. వీరిలో ప్రేమ్‌రాజ్‌నాయక్‌ను ముక్కలు, ముక్కలుగా నరి కి చంపాలని కోరింది. వీడు అమాయకులైన అమ్మాయిలకు స్నేహం పేరుతో దగ్గరై వంచించాడని రాసింది. మత్తు మందు ఇచ్చి.. ఆపై వీడియోల పేరుతో బెదిరించి పాడుచేస్తున్నాడని ఆరోపించింది. పది మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన నాయక్‌ను వదలొద్దని కోరింది.

No comments:

Post a Comment