పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 6 November 2015

బంగారంపై 90 శాతం రుణాలు

సిండికేట్‌ బ్యాంకు ఎండి, సిఇఒ అరుణ్‌ శ్రీవాత్సవ 


రైతులకు బంగారంపై 90 శాతం రుణాలు ఇవ్వనున్నట్లు సిండికేట్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ అరుణ్‌ శ్రీవాత్సవ్‌ తెలిపారు. గురువారం నాడిక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి తనఖా లేకుండా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.
 
రైతులకు బంగారం విలువలో 90 శాతం వరకు రుణాన్ని (3 లక్షల రూపాయల వరకు) 10 శాతం కంటే తక్కువ వడ్డీతో ఇచ్చే కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిండికేట్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రగతి బ్యాంక్‌ చైర్మన్‌ సంపత్‌ కుమార్‌ ఆచార్య, పాల్గొన్నారు.

No comments:

Post a Comment