పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 6 November 2015

మహేష్ తర్వాతి సినిమాకి ముహూర్తం ఫిక్స్



శ్రీమంతుడు సినిమాతో ఘన విజయం అందుకున్న మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నారు. దీంతర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తారన్న విషయంలో పలువురు దర్శకుల పేర్లు వినిపించినా చివరికి మురుగదాస్ పేరు కన్ఫర్మ్ అయింది. వీరి కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 12న మొదలవుతుందన్నది లేటెస్ట్ అప్డేట్. బ్రహ్మోత్సవం సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని అనుకున్నా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అనుమానంగానే వుంది. గనక కాస్త అటుఇటుగా మార్చి నాటికి బ్రహ్మోత్సవం పని పూర్తవుతుంది. అక్కడకు కొద్ది రోజుల తర్వాత మురుగదాస్ సెట్స్ లోకి అడుగుపెడతారు మహేష్. అన్నట్టు.. బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్‌బాబు గారాలపట్టి సితార ఓ సన్నివేశంలో కనపడనుందిట.

No comments:

Post a Comment