పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 6 November 2015

గ్రేటర్‌ ఎన్నికలతో.. జనసేన ఆరంగేట్రం..?



బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం! 



జనసేన పార్టీ ఎన్నికల అరంగేట్రానికి తెలంగాణ వేదిక కానుందా? అంటే అవుననే జవాబువస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అభ్యర్థులను దింపేందుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆసక్తి చూపుతున్నట్లు వినబడుతోంది. అంతా కుదిరితే గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రత్యర్థులకు పోటీ ఇవ్వనుందని బీజేపీ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ ఆవిర్భవించినా.. ఆ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే! అయితే ఎన్నికల గుర్తును మాత్రం కేటాయించలేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదలిస్తే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో ప్రాధాన్యం ఇస్తామనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్‌కళ్యాణ్‌ను కలిసిన పలువురు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూటమిగా రంగంలోకి దిగుదామని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు పవన్‌ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment