సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సిసి లిమిటెడ్ అద్భుత ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌ఎలోన్ నికర లాభం ఏకంగా 148 శాతం వృద్ధి చెంది 22.12 కోట్ల రూపాయల నుంచి 54.95 రూపాయలకు చేరుకుంది. సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు 2,284.43 కోట్ల రూపాయల నుంచి 2,147.98 కోట్ల రూపాయలకు క్షీణించాయి. ఈ కాలంలో పన్ను చెల్లింపునకు ముందు లాభాలు, తరుగుదల 184.42 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ 2,420.60 కోట్ల రూపాయల మొత్తం రాబడులపై 41.20 కోట్ల రూపాయల నికర లాభాన్ని సాధించినట్లు ఎన్‌సిసి తెలిపింది. కాగా సె ప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో 3,922.51 కోట్ల రూపాయల మొత్తం రాబడిపై 96.16 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ న మోదు చేసుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ మొత్తం 2,293 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో ఆర్డర్ బుక్ 17,487 కోట్ల రూపాయలకు చేరుకుంది. కాగా అక్టోబర్ నెలలో 2,058 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎన్‌సిసి తెలిపింది. మంగళవారం ఎన్‌సిసి షేరు 2.08 శాతం నష్టంతో 75.35 రూపాయల వద్ద క్లోజైంది
No comments:
Post a Comment