రాజధానికి సంబంధించిన ఫైనల్ మాస్టర్ ప్లాన్ను ఈ నెల 22వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. మాస్టర్ ప్లాన్ విడుదల అనంతరం భూసమీకరణ పథక నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ శనివారం మీడియాతో మాట్లాడారు. రైతులకు దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయడానికి 30 రోజుల గడువు ఉంటుందని ఆయన సృష్టం చేశారు. అగ్రికల్చర్ జోనపై ప్రజాప్రతినిధులకు, నాయకులకు అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. చాలా మంది గ్రీనజోనను అగ్రికల్చర్ జోన్‌గా భావిస్తున్నారని, అగ్రికల్చర్ జోనలో రెసిడెన్సియల్, కమర్షియల్ భవన నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ఈ విషయంలో వ్యక్తమవుతున్న అనుమానాలపై సీఆర్‌డీఏ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి లాటరీ పద్ధతిన రైతులకు భూములు అందిస్తామన్నారు. మూడు నెలల్లో తాత్కాలిక సచివాలయం సిద్ధమవుతుందని చెప్పారు. నెల్లూరులో పెన్నా బ్యారేజీ పనులను కూడా శనివారం ఆయన పరిశీలించారు.
No comments:
Post a Comment