పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

ఇసుక టెండర్‌ విధానంలో సవరణలు


ఇసుక టెండర్‌లో విధానంలో ప్రభుత్వం సవరణలు చేసింది. రీచల వద్ద క్యూబిక్‌ మీటర్‌ ఇసుక రూ.500 కన్నా ఎక్కువకు విక్రయించేందుకు వీల్లేదని స్పష్టం చేసిన మైనింగ్‌ శాఖ... తాజాగా అప్‌ సెట్‌ ధరను 25 శాతంగా పేర్కొంది. అంటే అప్‌ సెట్‌ ధరను రూ.125గా ఖరారు చేసింది. గతంలో కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి ఫీజులు, రాయల్టీలను రూ.1000 నుంచి రూ.2000 వరకూ చెల్లించేందుకు ముందుకు రావడంతో గనుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.125- రూ.500 మధ్య ఎంత చెల్లింస్తారో బిడ్లలో దాఖలు చేయాలని పేర్కొంది. ఈ ధరల మధ్య వచ్చే బిడ్లను పరిశీలించి టెండర్‌ను ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించారు.

No comments:

Post a Comment